
దీనిపై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చాలా సూటిగానే స్పందించారు. “ఒక్క హైదరాబాద్‌లోనే కాదు… ఆంధ్రాతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో, విదేశాలలో కూడా ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనలు తెలిపారు. కానీ ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదు. కానీ ఒక్క హైదరాబాద్‌లోనే సమస్య వస్తుందా?
అయినా మేము ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగానే మా పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించుకొన్నాము. హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు కూడా అదే చేశారు. దానిని శాంతిభద్రతల సమస్యగా చెప్పడం సరికాదు,” అని అన్నారు.
రాష్ట్ర విభజన చేసి తెలంగాణ సాధించుకొనేందుకు బిఆర్ఎస్ నేతలు పదేళ్ళపాటు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చినప్పుడు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నామనుకోలేదు. ఆ సమయంలో ఏపీలో కూడా నెలల తరబడి ఆందోళనలు జరిగాయి. అప్పుడూ బిఆర్ఎస్ నేతలకు తప్పనిపించలేదు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు రోడ్లపై బైటాయించి ధర్నాలు చేసినప్పుడూ శాంతిభద్రతల సమస్య మంత్రి కేటీఆర్‌కు గుర్తురాలేదు. చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని విచారణకు పిలిస్తేనే బిఆర్ఎస్ పార్టీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
కానీ ఐటి రంగానికి పునాది వేసి తమ జీవితాలలో వెలుగులు నింపినందుకు హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా ఆయన అరెస్టును ఖండించడానికి బయటకు వచ్చి ఆందోళన చేస్తే తప్పనిపిస్తోంది. బహుశః తనకు దక్కాల్సిన ఆ ‘ఐటి డెవలప్‌మెంట్ క్రెడిట్’ చంద్రబాబు నాయుడుకి దక్కుతోందని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌కు అసహనం కలిగిన్నట్లుంది.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో ఉంటూ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్న కేటీఆర్, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించలేకపోయారు. ఇదేనా రాజకీయ పరిణితి?కేటీఆర్ మాటలతో చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్ధిస్తున్నట్లే అనిపిస్తోంది! ఏపీ రాజకీయ గొడవలతో తమకు సంబందం లేదన్నారు. మరి ఏపీలో బిఆర్ఎస్ పార్టీని ఎందుకు విస్తరించాలనుకొంటున్నారు?రేపు ఏ మొహం పెట్టుకొని ఏపీకి రాగలరు?
దేశాన్ని ఉద్దరిస్తామని బయలుదేరుతున్న కేసీఆర్, పొరుగు రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే స్పందించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని సమర్ధిస్తే లేదా వ్యతిరేకిస్తే ఏమవుతుందో అని లెక్కలు కట్టుకొంటున్నారు?ఇంతకీ తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల కోసమా లేదా జగన్‌తో సక్యత కోసమా?
కేసీఆర్ ఎన్ని లెక్కలు కట్టుకొన్నా చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన వైఖరిపై తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు తప్పకుండా తమ తీర్పు ఎలాగూ చెపుతారు.
JanaSena chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has asked TDP and BJP…
Megastar Chiranjeevi has praised the changes taking place in Andhra Pradesh, highlighting improvements in village…