
“జగన్ ఎవరో మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా వచ్చి కేవలం మూడేళ్లు మాత్రమే అయ్యింది, కానీ ఒక అద్భుతమైన లీడర్, పెట్టుబడుల పెట్టేవారికి ఏపీ రెడ్ కార్పెట్ వేస్తుందన్న” అభిప్రాయాన్ని మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్ వేదిక పై వ్యక్తం చేయగా, ‘ఖాళీ కుర్చీలకు ఈ ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడానికి అబుదాబి వెళ్లాలా’ అంటూ నారా లోకేష్ మాస్ పంచ్ లు వేసారు.
ఇక జగన్ ఎవరో తెలియదని చెప్పడం మీ స్పీచ్ కే హైలైట్ అని చెప్పిన లోకేష్, మీ బెదిరింపుల దెబ్బకు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయి, అంతేగాక మీ ఘనతను కూడా ప్రచారం చేస్తున్నాయి, అందుకే అంతర్జాతీయంగా ఏపీ పరువు గంగలో కలిసిపోయిందంటూ వైసీపీ ప్రభుత్వ తీరు గురించి తీవ్రంగా విమర్శించారు.
కొత్త కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఎలాగూ మీకు చేత కాదు, కనీసం ఉన్న కంపెనీలు అయినా రాష్ట్రం విడిచి పోకుండా చూసుకోండి, అదే పది వేలు… అంటూ జగన్ సర్కార్ కు హితవు పలికారు. గత మూడేళ్ళుగా ఏపీలో పెట్టుబడులు లేక విలవిలలాడుతున్న వైనంతో, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కించుకుంది.
ఒక రాజకీయ నాయకుడిగా సరైన విమర్శలను చేయడంలో నారా లోకేష్ పరిపక్వత ఇటీవల కాలంలో స్పష్టంగా కనపడుతోంది. అధికారంలో ఉన్నపుడు నారా లోకేష్ చేసిన ప్రసంగాలకు, గత రెండేళ్లకు పైగా నారా లోకేష్ మాట్లాడుతున్న విధానంలో మార్పులు ఇట్టే గమనించవచ్చు. వైసీపీ తీరును ప్రజలకు అర్ధం అయ్యేలా ఎండకట్టడంలో లోకేష్ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి.
ఒకప్పుడు నారా లోకేష్ ప్రసంగాలకు పెదవి విరిసిన టిడిపి నేతలు, ప్రస్తుత మార్పుతో మిక్కిలి సంతోషంగా ఉన్నారు. పెట్టుబడుల గురించి వైసీపీ సర్కార్ ను విమర్శించే ముందు, ‘రక్తచరిత్రలో జగనాసుర’ అంటూ విడుదల చేసిన వీడియోకు కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. ప్రజలకు చేరువ అయ్యేలా విమర్శలు చేస్తే ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో ప్రస్తుతం నారా లోకేష్ కు అర్ధమవుతున్నట్లుగా ఉంది.
ఆటలో అరటిపండు.. అంటే ఇదేనేమో? తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు, కేసీఆర్ నేతృత్వంలోని ఓ బలమైన ప్రాంతీయ పార్టీ మద్య…
There is an uncomfortable pattern in recent Telugu commercial cinema. Sexual violence, sexual threats and…