
రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తోంది. కానీ ఇంతవరకు అటువంటి ప్రతిపాదన ఏదీ జగన్ ప్రభుత్వం తమకు పంపించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంటులోనే చెప్పింది. జగన్ కనీసం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిని కలిసి మా ప్రభుత్వం కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలనుకొంటోంది అని అయినా చెప్పలేదు. సుప్రీంకోర్టుకి చెప్పకుండా తెలియకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం సాధ్యమేనా?
నేను కర్నూలులో పాదయాత్ర చేసినప్పుడు, అక్కడి ప్రజలను కలిసినప్పుడు ‘కర్నూలులో హైకోర్టు పెడతాము, న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్ మమ్మల్ని మోసం చేశారు. అమరావతి ఏర్పాటు చేస్తానని అక్కడి రైతులను మోసం చేశారని నాకు చెప్పారు.
అయితే జగన్ కర్నూలు, అమరావతి ప్రజలనే కాదు… విశాఖ ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు. నిన్న వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంటులో విశాఖలోని ఋషికొండపై సచివాలయం నిర్మిస్తున్నామని ట్వీట్ చేశారు. మళ్ళీ కాసేపటికే దానిని డిలీట్ చేసేసి పొరపాటున అలా పోస్ట్ పడిందని, అక్కడ పర్యాటకశాఖ భవనాలే కడుతున్నామని మరో ట్వీట్ పెట్టారు. అంటే విశాఖ ప్రజలను కూడా జగన్ మోసం చేస్తున్నాడని స్పష్టమైంది.
కర్నూలు, అమరావతి ప్రజలను మోసం చేసిన జగన్ మనల్ని మోసం చేయకుండా ఉంటాడా? అని వైజాగ్ ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్కు కర్నూలుని న్యాయ రాజధాని చేయాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో నేరుగా మాట్లాడి పనులు ప్రారంభించేవాడు. కానీ అలా చేయలేదు.
అమరావతిని పాడుబెట్టేసి పరిపాలనా రాజధాని అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నాడు. విశాఖ రాజధాని అంటున్న జగన్ అక్కడ ఇంతవరకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఈవిదంగా రాష్ట్ర ప్రజలందరినీ జగన్ మోసం చేస్తూనే ఉన్నాడు. పైగా ఆ పేరుతో ప్రజల మద్య చిచ్చుపెడుతున్నాడు.
రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా నాలుగున్నరేళ్ళు కాలక్షేపం చేసేసి ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుంటే ప్రజలను మభ్యపెట్టేందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పనులన్నిటికీ మరోసారి శంకుస్థాపనలు చేస్తున్నారు.
మాట తప్పను… మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకొంటూ ఇన్నిసార్లు మాట తప్పి, మడమ తిప్పి ప్రజలను పదేపదే మోసం చేస్తున్న ఈ జగన్… వైసీపీ మనకి అవసరమా?రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి.
మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించుకోండి,” అంటూ నారా లోకేష్ ప్రజలను హెచ్చరిస్తూనే జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు.
“రాజకీయ వ్యూహాలు పన్నడంలో మా జగన్కు ఎవరూ సాటిరారు” అని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటుంటారు. కానీ మూడు రాజధానుల వ్యూహం ఇలా బెడిసికొట్టిందేమిటి?పైగా ఆనాడు ‘పప్పు’ అంటూ అవహేళన చేసిన నారా లోకేష్కే ఇలా అడ్డంగా దొరికిపోయారేమిటో? డామిట్! కధ అడ్డం తిరిగింది.
Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…