
తాను తండ్రి బాటలోనే ముందుకు సాగుతూ జగన్ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పలుమార్లు తాను తన తండ్రి చంద్రబాబు నాయుడులా మెతక వైఖరితో సర్దుకుపోయేవాడిని కానని, మాటకు మాట, చర్యకు ప్రతిచర్య ఇస్తానని విస్పష్టంగా చెప్పారు. పాదయాత్రలో కడపలోనే ‘హూ కిల్డ్ బాబాయి’ అని ప్రశ్నించడం, పోలీసులు అడ్డుకొన్నప్పుడు, వైసీపి కార్యకర్తలు కవ్వించినప్పుడు నారా లోకేష్ వ్యవహరించిన తీరుతో అది నిరూపించుకొన్నారు కూడా. కనుక ఇప్పుడు ఏవిదంగా టిడిపి శ్రేణులను నడిపించబోతున్నారనేది నారా లోకేష్ రాజకీయ భవిష్యత్కి సూచికగా నిలువబోతోంది.
చిత్రం: రణబాలి M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026 తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న,…
Keerthy Suresh hasn’t had the best run at the box office lately. Her recent films…