
డిఎస్సి ఉద్యోగాలలో ఎన్నో అవకతవకలు, భారీ అవినీతి, ఇది మెగా డిఎస్సి కాదు ప్రభుత్వ దగా డిఎస్సి అంటూ వైసీపీ గత కొద్దీ రోజులుగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
పార్టీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ మాజీ మంత్రులు, నేతల వరకు అందరు జగన్ స్లొగన్స్ ను ఫాలో అవుతూ డిఎస్సి లో మంత్రి లోకేష్ భారీ స్కాం చేసారంటూ కోడైకూస్తున్నారు. ఇక వైసీపీ ఆరోపణల పై ప్రభుత్వ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో వివరం ఇప్పిస్తున్నప్పటికీ వైసీపీ తానూ పట్టిన కుందేలుకు ముందే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
అయితే తాజాగా ఈ వివాదం పై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తానూ జగన్ తాడేపల్లి ప్యాలస్ కి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉన్నానని, గొడ్డలి పార్టీ నేతల మాదిరి బురద జల్లి పారిపోవడం లేదని, డిఎస్సి నియామకాలలో ఎవరికైనా అనుమానులుంటే తన తో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.
తానూ ఏసీ రూమ్స్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి చేతులుదులుపుకోవడం లేదని, తన సవాల్ ను స్వీకరించి ఎవరైనా వైసీపీ నేతలు చర్చకు వస్తే అందుకు తానూ సిద్ధమంటూ ప్రకటించారు లోకేష్. సవాల్ స్వీకరించే దైర్యం ఉంటె రావాలని, జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియమాలకు ఆపలేరని,
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ ఒక్క డిఎస్సి అయినా ప్రకటించారా అంటూ ఎదురు ప్రశ్నింస్తూనే, అలా ప్రకటిస్తే హారిజాంటల్, వర్టికల్ రిజ్వేషన్లను అర్ధమవుతాయంటూ జగన్ ను ఎద్దేవ చేసారు లోకేష్. అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు ఉంటె లోకేష్ విసిరిన సవాల్ కి సై అంటూ ముందుకు రావాల్సి ఉంటుంది.
వైసీపీ ఈ సవాల్ విషయంలో వెనుకడుగు వేసిందా వైసీపీ ఇన్నాళ్లు చేసిన విమర్శలు కేవలం రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మరి జగన్ ఇంటికి 200 మీటర్లలో వైసీపీ నేతల ముందు ఉన్న ఈ సవాల్ ను ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందుకొస్తారో లేదా నాటి మాజీ విద్యా శాఖ మంత్రి ముందుకొస్తారో చూడాలి..!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…