పవన్ కు కౌంటర్ ఇచ్చిన లోకేష్!

Nara Lokesh's Strong Reply on his Voter Card Remarks‘మీ అబ్బాయి గారి అవినీతి మీ దాకా చేరిందో లేదో నాకు తెలియదు గానీ, పొలిటికల్ వర్గాల్లో మాత్రం పుంకాలు పుంకాలుగా చెప్పుకుంటున్నారు, శేఖర్ రెడ్డి కేసుతో లోకేష్ సంబంధం ఉందంటున్నారు, ఇవన్నీ వింటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’ అంటూ నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్.

పవన్ పేరు ఎత్తలేదు గానీ, సరిగ్గా పవన్ కు తగిలే విధంగా సమాధానం చెప్పారు. ‘తన తాత ఎన్టీఆర్ మరియు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు నాకు వస్తాయో రావో తెలియదు గానీ, వారికి చెడ్డ పేరును మాత్రం తీసుకురానంటూ’ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎక్కడా పవన్ పేరును ప్రస్తావించలేదు గానీ, జవాబు మాత్రం పవన్ కే ఇచ్చారు.

ADVERTISEMENT

జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై టిడిపి ముఖ్య నేతలందరూ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యల వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందన్న అనుమానాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా, రాజకీయ విశ్లేషకులందరూ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందో లేక మున్ముందు పతాక స్థాయికి చేరుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories