
గత ఎన్నికలలో టిడిపి యువనేత నారా లోకేష్‌ని వైసీపిఎంతగా అవహేళన చేసిందో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. మరో వ్యక్తి అయితే ఆ అవహేళనలను భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. కానీ నారా లోకేష్ వాటి నుంచే పాఠాలు నేర్చుకొని ఇప్పుడు వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు నారా లోకేష్‌కి కౌంటర్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారంటే ఆయన పొలిటికల్ ర్యాంగింగ్ ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.
నారా లోకేష్ శంఖారావం పాదయాత్రతో మళ్ళీ ప్రజల మద్యకు వచ్చారు. నేడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శంఖారావం సభలో నారా లోకేష్ సిఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరూ కాదనలేరు.
· కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే పోస్టర్స్ రాష్ట్రమంతా పెట్టించుకున్నారు. కానీ ఆయన తన మంత్రులను, ఎంపీ, ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. వారు కూడా ఆయనను నమ్మడం లేదు. ఇక ప్రజలెందుకు నమ్ముతారు?
· సొంత చెల్లి వైఎస్ షర్మిల, బాబాయ్ కూతురు సునీతా రెడ్డి ఇద్దరూ కూడా అన్నని నమ్మడం లేదు.
· ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి తమకు అన్న వలన ప్రాణభయం ఉందని చెపుతున్నారు. అన్నను చూసి చెల్లెళ్లే భయపడుతుంటే, రాష్ట్రంలో ఆడవాళ్ళకు భయంవేయదా?
· ఇంట్లో ఆడవాళ్ళపైనే సొంత పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తున్న జగన్ రాష్ట్రంలో ఆడవాళ్ళని కాపాడుతారా?
· ఈ మద్య జగన్ తన ప్రసంగాలలో ‘నేను మీ బిడ్డని…’ అని నొక్కి చెపుతున్నారు. ఆయన మాట నమ్మి మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే, నేను మీ బిడ్డనే కదా అంటూ మీ ఆస్తిపాస్తులు గుంజుకుంటాడు.
· ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా జగన్ ప్రభుత్వం డీఎస్సీ జారీ చేసింది. అది వైసీపిని కాపాడుకునేందుకు చేస్తున్న చివరి ప్రయత్నం మాత్రమే. టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలండర్ విడుదల చేసి ఏటా డీఎస్సీ విడుదల చేస్తాము.
· కోట్లు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీయిస్తే ఉచితంగా టికెట్లు ఇచ్చి చేతిలో డబ్బు పెడుతున్నా ఎవరూ సినిమా చూసేందుకు వెళ్ళడం లేదు. బహుశః ఇదే జగన్ ప్రభుత్వానికి అంతిమ యాత్ర కావచ్చు అంటూ టిడిపి యువనేత నారా లోకేష్ సెటైర్లు వేశారు.
Khushi Dubey knows how to make black feel anything but basic. In this striking photoshoot,…
Following the terrible failure of Coolie, Rajinikanth is all set to return with his next…