
మొదట వైసీపీ కార్యకర్తలు, ఆ తర్వాత పోలీసుల నుంచి అనేక అవరోధాలు ఎదుర్కొన్నారు. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా నారా లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. పోలీసుల బెడద తీరిందనుకొంటే భయంకరమైన వేసవి ఎండలు మొదలయ్యాయి. మద్యలో కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా పడ్డాయి. అయినా నారా లోకేష్ మండే ఎండలను, వర్షాలను తట్టుకొంటూ యువగళం పాదయాత్రను కొనసాగిస్తూ 100 రోజులు పూర్తి చేస్తున్నారు.
ఎండలు మండిపోతున్నాయనో లేదా వర్షాలతో ఇబ్బందిగా ఉందనో నారా లోకేష్ మొక్కుబడి పాదయాత్రతో సరిపెట్టలేదు. దారి పొడవునా అన్ని వర్గాల ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటూనే ఉన్నారు. దారిలో అనేక సభలు నిర్వహిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను, వైఫల్యాలను నిలదీసి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని, ఇప్పుడు వైసీపీ పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని ‘సెల్ఫీ ఛాలెంజ్’ పేరిట పోల్చి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర చేపట్టాలనుకొన్నప్పుడు “అది మూడు రోజుల ముచ్చటే… యువగళం పాదయాత్రతో టిడిపికి ఒరిగేది లేదు… వైసీపీకి తరిగేదీ ఉండదు,” అంటూ వైసీపీ నేతలందరూ పోటీలుపడి అవహేళన చేశారు. కానీ నారా లోకేష్ వారి అవహేళనలకు తన పాదయాత్రతోనే సమాధానం చెప్పారు. ఇప్పుడు 100 రోజులు పాదయాత్ర పూర్తి చేయబోతుండటంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకొంటుండగా, వైసీపీలో అంబటి, కొడాలి, రోజా వంటి ఫిరంగులన్నీ సైలెంట్ అయిపోయాయి.
నారా లోకేష్ నేడు శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి సోమవారం ఉదయం 100వ రోజు పాదయాత్ర ప్రారంభించినప్పుడు, ఆయన తల్లి నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు వచ్చి అభినందించి, ఆశీర్వదించి కలిసి కొంచెం దూరం పాదయాత్ర చేశారు. నారా లోకేష్ 100 రోజులు పాదయాత్ర సందర్భంగా బోయరేవుల, మోతుకూరు వద్ద టిడిపి శ్రేణులు బాజాబజంత్రీలు, టపాసులతో నారా లోకేష్కు ఘన స్వాగతం పలికి వెంటనడిచారు. కర్నూలు జిల్లాతో సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని టిడిపి నేతలు నారా లోకేష్కు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
నారా లోకేష్ 400 రోజులలో శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు 4,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే 100 రోజులలో 1,269 కిమీ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తిచేశారు. కనుక మిగిలిన పాదయాత్రను కూడా దిగ్విజయంగా పూర్తిచేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
Sanchi Rai gives the saree a moodier, more playful makeover in this warm, intimate photoshoot.…
Vijay Deverakonda's Ranabaali, directed by Rahul Sankrityan, was released in theatres yesterday (October 16th) and…