
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి నారా లోకేష్ కొంగారెడ్డి పల్లె జంక్షన్ వద్ద బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అనంతరం సాయంత్రం 5.15 గంటలకి అక్కడే ఏర్పాటు చేసిన అన్నాక్యాంటీన్ నిర్వహిస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతారు. రాత్రి 7.30 గంటలకి దిగువ మాసానపల్లె చేరుకొని అక్కడే భోజనం చేసి రాత్రి బస చేస్తారు.
సోమవారం చిత్తూరు నియోజకవర్గంలోని నారా లోకేష్ 9.2 కిమీ పాదయాత్ర చేశారు. దారిలో బీడీ కార్మికులు, జిల్లా కోర్టు న్యాయవాదులు, ముస్లిం మైనార్టీ ప్రజలతో వరుసగా సమావేశమవుతూ వారి సమస్యలని అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగారు. పెద్ద హరిజనవాడలో మహిళలు నారా లోకేష్పై పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు.
వారితో మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డిని అబద్దాల రెడ్డి అని అనొచ్చు. ఎందుకంటే సొంత బాబాయ్ హత్యకి గురైతే అది గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. 48 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీలకి పెన్షన్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న పెన్షన్లనే తొలగించేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి పధకం ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇస్తున్నారు. మొదట అమరావతే మన రాజధాని అన్నారు కానీ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న ఈ మూడు ముక్కలాట కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, ఐటి కంపెనీ కూడా రావడం లేదు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే పోలీసులు పట్టుకోలేరు కానీ వైసీపీ ప్రభుత్వం విధానాలని ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తారు. రాష్ట్రాన్ని ఎలాగూ అభివృద్ధి చేయలేరు కనీసం సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమ పధకాలనైనా సక్రమంగా అమలుచేయాలని నేను కోరుతున్నాను,” అని నారా లోకేష్ అన్నారు.
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…
రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు అనేవి సర్వసాధారణం. అయితే ఆ పొత్తుల వలన పార్టీలకు ఒక్కోసారి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు…