Telugu

పొత్తులో ప్రయోజనాలు – నష్టాలు సమతూకం కాదా.?

రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు అనేవి సర్వసాధారణం. అయితే ఆ పొత్తుల వలన పార్టీలకు ఒక్కోసారి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయో అలాగే కొన్ని సందర్భాలలో అలాగే నష్టాలు కూడా సంభవిస్తాయి. అయితే ఆ రెండిటిని సమతూకంలో చూడగలిగే పరిస్థితి పార్టీ అధినేతలకే కాదు పార్టీ కింద స్థాయి క్యాడర్ కి కూడా ఉండగలగాలి.

2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఏర్పడిన రాజకీయ పొత్తు మూడు పార్టీలకు భారీ స్థాయిలో రాజకీయ లబ్దిని చేకూర్చాయి. అడే సమయంలో పొత్తు మూడు పార్టీల నేతల నుండి త్యాగాలు కోరుకుంది. ఇక్కడ పొత్తు కారణంగా మూడు పార్టీలు ఎలా అయితే రాజకీయ ప్రయోజనం పొందాయో అలాగే మూడు పార్టీల నేతలు కొంత రాజకీయ నష్టాన్ని చవిచూశాయి.

ADVERTISEMENT

అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు ఒకే పొత్తుగా ముందుకు వెళ్లగలిగితే మూడు పార్టీలు రాజకీయ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మూడు పార్టీల నేతలకు కూడా సీట్ల త్యాగాలు తప్పనిసరి.

అయితే ఇక్కడ ఏ పార్టీ క్షేత్ర స్థాయి బలం బట్టి ఆ పార్టీ త్యాగాలకు సిద్దమవ్వాల్సిందే. ఇందులో ఒకరి వాటా ఎక్కువగా మరొకరి వాటా తక్కువ కనిపించినప్పటికీ అల్టిమేట్ గా మూడు పార్టీల అధిష్టానాలకు సీట్ల సర్దుబాటు, పార్టీ నేతలను సంతృప్తి పరచడం, క్యాడర్ ని సంతోష పెట్టడం కత్తి మీద సామే అవుతుంది.

అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కు ఆ పార్టీ క్యాడర్ నుంచి మరింత ఒత్తిడి ఎదురవడం ఇక్కడ కూటమి పొత్తుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన 100 % రేట్ తో సృష్టించిన అరుదైన రికార్డు పొత్తు కారణంగానే సంభవించిందనేది జగమెరిగిన సత్యమే.

అలాగే అదే పొత్తు జనసేన నుంచి బారి టీకాలను కూడా ఆశించింది. అయితే ఈరెండిటిని బేరీజు వేసుకునే పార్టీ శ్రేణులు రాజకీయంగా ముందడుగు వేయగలిగితే జనసేన రాజకీయంగా మరోమెట్టు పైకెక్కి పరిస్థితే ఉంటుంది. అలాగే ఒకపక్క దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి, క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉండి, ఒక్క సీటు కోసం ముగ్గురు నలుగురు పోటీ పడే స్థాయి ఉన్న టీడీపీ ఆ సీటును పొత్తులో భాగంగా మిత్ర పక్షాలకు కేటాయించడం టీడీపీ లో అసంతృప్తికి కారణమవుతుంది.

పార్టీకోసం దశాబ్దాలుగా శ్రమిస్తున్నాం, గత ప్రభుత్వంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నాం, అయినా పార్టీ కోసం నిలబడ్డాం…మాకు మా అధినేత పొత్తు పేరు చెప్పి అన్యాయం చేస్తున్నాడు అంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు.

అలాగే పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఇంత వ్యత్యాసమా.? పార్టీ లో సీటు సంపాధించాలంటే పక్క పార్టీ నుండి వలస రావాల్సిందేనా.? ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీలో దక్కిందేమిటి అంటూ జనసైనికుల ఆవేదన.

అయితే ఇక్కడ పొత్తు కారణంగా రెండు పార్టీలు ఏ స్థాయిలో అయితే రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయో అదే స్థాయిలో పార్టీల నాయకులు సీట్ల త్యాగాలతో రాజకీయ నష్టాన్ని అనుభవిస్తారు. ఈ పొత్తు రాజకీయంలో ప్రయోజనాలు – నష్టాలు రెండు సమతూకాలంలోనే ఉంటాయి అనేది ఇరు పార్టీల శ్రేణులు గ్రహించగలగాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajamouli In Strange Ground: Worry Or Trust?

The greatest commercial film maker of this generation, Rajamouli is currently working on the most…

34 minutes ago

Vijay Needs Venky Atluri, But Why?

Vijay Devarakonda had a new release in the form of Ranabaali yesterday. The film opened…

2 hours ago