
చిత్తూరులో మొదలైన లోకేష్ యువగళం దాదాపు 70 రోజుల విరామం తరువాత ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ అన్నట్లుగానే రాజోలు నియోజకవర్గం నుండి అనూహ్య ప్రజాదరణ నడుమ మళ్ళీ పునః ప్రారంభమయ్యింది.అయితే ఈసారి లోకేష్ యువగళం 2 .0 టీడీపీ శ్రేణులలో నూతనుత్తేజాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి.
ఒక సైకో తీసుకున్న నిర్ణయం వలన తాత్కాలికంగా నిలిపివేసిన యువగళం కార్యక్రమానికి ముందుగా ప్రజలకు క్షమాపణలు అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన లోకేష్, సభకు హాజరైన టీడీపీ – జనసేన నాయకులకు అభినందనలు తెలుపుతూ…అరేయి ఫూల్స్, ఇక మొదలెడదామా? అంటూ ఇక తన తండ్రి అక్రమ అరెస్టుకు కారణమైన జగన్ ప్రభుత్వం మీద వైసీపీ నేతల మీద పంచ్ డైలాగ్స్ తో రెచ్చిపోయారు.
యుద్ధం మొదలయ్యింది ఇక సైకో జగన్ కు ఎక్సపైరీ డేట్ దగ్గర పడింది.అక్రమంగా దొంగ కేసులు పెట్టి బాబుని అరెస్టు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి టైం దగ్గర పడింది. జగన్ ను చూస్తే కటింగ్ ఫిటింగ్ మాస్టర్ గుర్తొస్తారు.100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈసైకో జగన్. అన్నా క్యాంటిన్ పథకాన్ని కట్ చేసిన కటింగ్ మాస్టర్.,మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య ఫిటింగ్ పెట్టిన ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ అంటూ ఉదాహారణలతో జగన్ వ్యక్తిత్వాన్ని ప్రజలకు వివరించారు.
చంద్రబాబుని, టీడీపీ పార్టీని చూసి భయపడుతున్న జగన్ ఇప్పుడు యువగళం కు వచ్చిన ప్రజాదరణ లైవ్ లో చూస్తే తాడేపల్లి కొంపలో ఒక టీవీ పగలడం ఖాయం బ్రదర్ అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సజావుగా సాగనిస్తే ఇది “యువగళం” అదే మీరు అడ్డంకులు సృష్టించి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూస్తే ఇది “దండ యాత్ర” టీడీపీ పార్టీ దండయాత్రగా మారుతుంది అంటూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శల జోరు పెంచుకుంటూ పోతున్నారు లోకేష్.
జనసేన పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీ పక్షాన చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక అక్రమాల పై కూడా లోకేష్ తన గళం వినిపించారు.అలాగే తన తల్లి భువనేశ్వరి తన భార్య బ్రాహ్మణి మీద కేసులు పెడతాం అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలకు సభలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పార్టీకి సంక్షోభాలు, పోరాటాలు కొత్తకాదని అన్న ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచే టీడీపీ ఎన్నో సంక్షోభాలను దాటి ఇక్కడిదాకా వచ్చిందని గుర్తుచేశారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ పై వైసీపీ ప్రభుత్వ ఆంక్షలను తప్పుబట్టారు.
ఇంకొక్క మూడు నెలలలో ఏపీ ప్రజలకు ఈ సైకో పాలన నుండి విముక్తి దొరుకుతుందని, అప్పుడు జగన్ లోటస్ పాండ్ పాలస్ కు గాని బెంగుళూర్ పాలస్ కు కానీ తాడేపల్లి పాలస్ కు గాని చివరిగా లండన్ పిచ్చి ఆసుపత్రికి కానీ వెళ్ళి సేద తీరొచ్చు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణుల లోలోపల ఉన్న నిశబ్దాన్ని లోకేష్ తన యువగళంతో నేడు బద్దలుకొట్టి క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు.
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…
The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…