Telugu

నా వెనుక ఎవరూ లేరన్న నారా రోహిత్!

ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక్క హిట్టు లేదు…
కనీసం ట్రెండ్ సెట్ చేసే సినిమా కూడా ఒక్కటీ లేదు…
అయినా… వరుసగా సినిమాల మీద సినిమాలు… ఆఫర్ల మీద ఆఫర్లు…
ఇది క్లుప్తంగా నారా రోహిత్ సినీ కెరీర్. ‘సక్సెస్’ను మాత్రమే కొలమానంగా భావించే సినీ పరిశ్రమలో, ఒక్క సరైన ‘సక్సెస్’ కూడా లేకుండా నారా రోహిత్ ఇన్ని అవకాశాలు ఎలా అందిపుచ్చుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెదనాన్న చంద్రబాబు నాయుడు ప్రభావం ఏమైనా ఉందా? బాబుకు సినీ ఇండస్ట్రీతో ఉన్న పరిచయాలు నారా రోహిత్ కు సినీ అవకాశాలను కలుగజేస్తున్నాయా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు, తెరవెనుక సంగతులకు సినీ ఇండస్ట్రీలో కొదవుండదన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

మరి ఇవే ప్రశ్నలను ఏకంగా నారా రోహిత్ ను అడిగితే ఏం చెప్తారు? శుక్రవారం నాడు విడుదల కాబోతున్న ‘శంకర’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా… తనకు వస్తున్న అవకాశాల గురించి నారా రోహిత్ వివరించారు. ‘నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ ఒక్క వ్యక్తిని నాతో సినిమా చేయమని అడగలేదని, ఇక ముందు కూడా అడగనని’ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఎవరో అనుకుంటున్నట్లుగా నా వెనుక ఎవరూ లేరని, ఎలాంటి ఫైనాన్షియర్లు లేరని, ఒకవేళ అలాగే ఉంటే, పెద్ద సినిమాలలో నటించి ఉండేవాడిని తప్ప, ఇన్ని చిన్న సినిమాలు చేసి ఉండేవాడిని కాదని వివరణ ఇచ్చుకున్నారు.

అయితే తనకు ఇన్ని అవకాశాల రావడం వెనుక ఉన్న కారణం… నాతో సినిమా చేసే వాళ్ళందరూ కొత్తవాళ్ళేనని, అందుకే ఎక్కడా డేట్స్ క్లాష్ అవ్వవని… తన సినిమాల వెనుకున్న గుట్టు విప్పారు నారా రోహిత్. ‘శంకర’ సినిమా విడుదల తర్వాత కూడా తన చేతిలో ఉన్న నాలుగు సినిమాల వివరాలు కూడా తెలిపారు నారా వారబ్బాయి. ‘పండగలా దిగివచ్చాడు, అప్పట్లో ఒకడుండేవాడు, కధలో రాజకుమారి’ సినిమాలతో పాటు పవన్ సాదినేని దర్శకత్వంలో మరొక సినిమాకు కమిట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

3 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

3 hours ago