
దీంతో పోలీసులను అడుగగా, తమకు తెలియదని సమాధానం చెప్పారు. ప్రత్యక్ష సాక్షులతోపాటు, ఆ పరిసరాల్లోని వారిని అడుగగా… కారును ఎవరో ప్రైవేటు వ్యక్తులు తరలించారన్న సమాధానం వచ్చింది. దీంతో మరింత లోతుగా ఆరాతీసిన మీడియా సంస్థలు సదరు కారును రహమత్ నగర్ అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ వెనుకనున్న పారిశ్రామిక విద్యాసంస్థకు చెందిన ఖాళీ ప్రదేశంలో గుర్తించాయి. కారును అంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ మృతదేహాలకు అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. నిషిత్ నారాయణ, రవివర్మలు అతి వేగం వల్ల మృతి చెందారని, మద్యం తాగినట్టు లేదని వారు తేల్చారు. ఈ ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని, నిషిత్ డ్రైవింగ్ చేస్తున్నాడని, బలంగా పిల్లర్ ను కారు తాకడంతోనే వారు మృతి చెందారని తేల్చారు. నిషిత్ కారు ముక్కలైపోయిందని వారు వెల్లడించారు. రవివర్మ కంటే నిషిత్ కే ఎక్కవ దెబ్బలు తగిలాయని వారు తెలిపారు.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…