
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ప్రధాన మంత్రి మోడీ చేసిన ఒక పని వైరల్ అయ్యింది. జాన్వీసింగ్ అనే మహిళ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు తీసుకోవడానికి వేదిక మీదకు వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లకు నమస్కరించారు.
అయితే దానికి ప్రతి నమస్కారంగా మోడీ కూడా ఆమె పాదాలకు నమస్కరించారు. ప్రధాని హోదాలో ఉంటూ ఇలా బహిరంగ వేదిక పైన ఎటువంటి భేషజాలకు పోకుండా తనకన్నా చిన్న వయస్సు ఉన్న ఓ మహిళ పాదాలకు మోడీ నమస్కరించడం ఆయన సంస్కారానికి నిదర్శనం అంటూ మోడీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మహిళాదినోత్సవం రోజు ఇటువంటి వ్యక్తికీ రాజ్యసభ అవకాశం దక్కటం అంటే అది నారీశక్తికి దక్కిన గౌరవంగానే భావించాలి అంటూ సుధా మూర్తికి అభినందనలు తెలియచేసారు మోడీ. ఆమె ఈ రంగంలో కూడా తన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్న అంటూ సుధామూర్తి పై ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని బయటపెట్టారు మోడీ.
అలాగే సుధామూర్తి కూడా తన పై గౌరవంతో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తాను అంటూ ప్రధానికి, రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియచేసారు. ఇలా ప్రముఖ విద్యావేత్త సుధామూర్తి పట్ల గౌరవం, జాన్వీ సింగ్ అనే మహిళ పట్ల మర్యాద చాటుకున్న మోడీ పట్ల అభిమానం చాటుకుంటున్నారు నెటిజన్లు. మోడీ ‘ఉమెన్స్ డేస్ ట్రీట్…’ అదిరింది అంటూ ఈ రెండు వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
An alleged mass shooting plot involving a Hindu temple in Aurora, Illinois, has been foiled,…
Gautam Gambhir turned 45 on Wednesday, October 14, but there was no birthday gift waiting…