
కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర నరమేధానికి గాను ప్రధాని నరేంద్ర మోడీ పాక్ కు సైనిక పరంగా కూడా ధీటైన బదులివ్వడానికి సిద్ధమవుతున్నట్టు గా పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే ఆ దేశానికి సింధు జలాల నిలిపివేత తో పాటుగా పాక్ తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పహాల్గమ్ ఘటన నేపథ్యంలో దేశ భద్రతా పరిస్థితుల పై చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశానికి గాను రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్ తో పాటుగా నావి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులు హాజరవడంతో మోడీ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసారు.
కాశ్మీర్ దాడి నేపధ్యం అనంతరం భారత్ పై పాక్ పాలపడుతున్న దుశ్చర్యలు, భవిష్యత్ లో ఈ ఉగ్రవాదం అణిచివేతకు తీసుకోవాల్సిన నిర్ణయాల పై ప్రధాని నివాసం జరిగిన సుదీర్ఘ సమావేశం లో మాట్లాడిన మోడీ తనకు భారత సాయుధ బలగాల మీద పూర్తి విశ్వాసం ఉందని, పెహల్గామ్ దాడికి భారత్ ధీటైన జవాబిస్తుందని పేర్కొన్నారు.
అలాగే ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించే విషయంలో భారత్ సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్చనిస్తుందని ఉద్ఘాటించారు. అందుకు సంబంధించిన అంశాల పై టైం, ప్లేస్ భారత్ సైన్యమే డిసైడ్ చేస్తుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ కు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయనేది స్ఫష్టమవుతుంది.
ఇప్పటికే భారత్ తమ పై తప్పకుండా తమ పై ప్రతీకార చర్యలకు దిగుతుందని ఊహించిన పాక్, భారత్ పై అణ్వయుధాలు ప్రయోగిస్తాం అంటూ భారత్ ను బెదించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే భారత్ సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చి పాక్ పై పంపితే పాక్ పరిస్థితి ఏమిటో ఇప్పటికే మూడు సార్లు రుచి చూసిన పాక్ తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు.
తాజాగా మోడీ చేసిన ఈ ప్రకటన పాక్ సైన్యానికి పరోక్ష హెచ్చరికవంటిదనే చెప్పాలి. భారత్ తో యుద్ధం భయంతో ఇప్పటికే పాక్ లో ఆర్మీ లో కొంతమంది దేశం వదిలి పారిపోయేందుకు సిద్దమయినట్టు వార్తలు హాల్సాహ్ల్ చేస్తున్నాయి. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ తన కుటుంబం తో కలిసి విదేశాలకు వెళ్ళిపోయినట్టు పాక్ మీడియానే వార్తలను ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…