
ప్రధాని మోడీ వైఖరి, పాలన, ప్రచారయావ, విదేశీ పర్యటనలు, రాజకీయాలు… వంటి రకరకాల కారణాలతో ఆయనని చాలా మంది విమర్శిస్తుంటారు. కానీ మోడీ హయంలోనే దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని అంగీకరించక తప్పదు.
మేకిన్ ఇండియా పేరుతో మళ్ళీ దేశంలో పారిశ్రామిక రంగానికి పునరుజ్జీవం కల్పిస్తున్నారు. భారత్ పట్ల విదేశాలకు గౌరవం పెరిగేలా చేశారు. మునుపెన్నడూ లేనివిదంగా భారత్‌ని చూసి పాకిస్తాన్ భయపడే పరిస్థితి కల్పించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులను చాలా వరకు అడ్డుకోగలిగారు.
విదేశాలతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటున్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అగ్రరాజ్యాల ఆంక్షలకు భయపడకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు.
దేశంలో తొలిసారిగా బులెట్ రైలు, వందే భారత్ రైళ్ళు పరిచయం చేస్తున్నారు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు అనేక రైలు, రోడ్డు మార్గాలు కొత్తగా నిర్మింపజేస్తున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా చాలా పెద్దదే ఉంది.
దీనిలో ఓ తాజా ఉదాహరణగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి ఏపీలో విశాఖ వరకు 464.66 కిమీ పొడవునా జాతీయ రహదారిని ఆరు వరుసలతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా అభివృద్ధి చేస్తున్నారు.
దీనిలో భాగంగా రెండు రాష్ట్రాలకు మద్య ఒడిశాలో సుంకి ఘాట్ వద్ద కొండలు తొలిచి ఆరు వరుసలతో రెండు సొరంగ మార్గాలు నిర్మిస్తున్నారు. ఇవి సముద్రమట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి.
వీటిలో ఒకదాని పొడవు 3.42కిమీ కాగా మరొకదాని పొడవు 2.8కిమీలు. వీటికి 2022లో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆరు వరుసలతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, రెండు సొరంగ మార్గాలు అందుబాటులోకి వస్తే రాయ్‌పూర్ నుంచి విశాఖకు ఏడు గంటల (రోడ్డు ప్రయాణం) తగ్గుతుంది.
భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగానిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే చత్తీస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అనేక నగరాలు, పట్టణాలు, పల్లెలు కలుపుతూ సాగుతుంది. కనుక ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మరింత తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో మూడు రాష్ట్రాల మద్య సరుకు రవాణా జరుగుతుంది.
Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…