
[m9ad]
కాంగ్రెస్ లాగా అభివృద్ధి చెయ్యకుండా అధికారంలో ఉందామంటే కష్టమని కేసీఆర్ మరో ఐదు సంవత్సరాలు రెస్టు తీసుకోకతప్పదని మోడీ అన్నారు. ఇంటికీ నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ ను లండన్ చేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ వచ్చే అయిదు సంవత్సరాలు లండన్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే అన్నారు. ఒకరకంగా ముందే శాసనసభను రద్దు చెయ్యడం మంచిదే. ప్రజలు ఆరు నెలల ముందే విముక్తి పొందారు అని మోడీ అన్నారు.
ఏడాది తిరగకుండా కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు అభిప్రాయం మార్చుకున్నట్టు? పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్ధం చెప్పారా? లేక ఇప్పుడు అబద్దం చెబుతున్నారా? ప్రధాని స్థాయికి ఇటువంటి మాటలు తగునా? అయితే విశ్లేషకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రజకూటమి వైపు వెళ్లకుండా మోడీ తెలివిగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తద్వారా అధికార ప్రక్షానికే కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక తాటి మీదకు తెచ్చిన విషయం తెలిసిందే.
Old-generation music director Saluri Vasu Rao has slammed Sai Pallavi’s casting as Sita in Ramayana,…
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు…