ఎన్డీయే 2.0 …అమరావతికి మూడేళ్లే..!

2024 లో ఏపీలో అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే 2.0 (టీడీపీ, జనసేన, బీజేపీ) రాబోయే మూడేళ్ళలో ఏపీ దశా దిశా మార్చబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

నేడు వెలగపూడిలో అమరావతి పనుల పునః ప్రారంభానికి విచ్చేసిన మోడీ రానున్న మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి పనులు పూర్తి చేసి ఎన్టీఆర్ కలలు కన్న వికసిత ఆంధ్రప్రదేశ్ ను రూపాందించాలని ఆకాంక్షించారు.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ను ఉద్దేశించి ఈ కార్యక్రమాలను మనమే పూర్తి చేయాలంటూ ప్రత్యేకంగా తెలుగులో ఉటంకించి మరి చెప్పారు మోడీ. అయితే రానున్న మూడేళ్ళ కాలపరిమితిలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి అంటే అందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించగలగాలి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న మూడేళ్ళలో వైసీపీ అమరావతి పై చేసే దుష్ట రాజకీయాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, నీలి మీడియా ప్రచారాలకు చెక్ పెట్టగలగాలి. గతంలో మాదిరి విపక్షాల అసత్యపు ప్రచారాల పై అలసత్వం వహించక అమరావతి నిర్మాణాలతో పాటుగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పై ఫోకస్ పెట్టగలగాలి.

నిధుల సమీకరణ, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పనా వంటి వాటి పై ప్రభుత్వం సీరియస్ గా ద్రుష్టి కేంద్రీకరిస్తే రానున్న మూడేళ్లలో ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్న అమరావతి రాజధానికి ఒక అందమైన, అద్భుతమైన రూపాన్ని అందించవచ్చు. ఎన్డీయే 2.0 అమరావతి నిర్మాణం పై దృఢ సంకల్పముతో ఉంది అనేలా మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

మోడీ ప్రసంగించినట్టు అనుకున్నవి అనుకున్నట్టుగా సజావుగా సాగగలితే ఎన్డీయే 2.0 పాలనతో జగన్ 2.0 కు చెక్ పెట్టినట్టే అవుతుంది. అయితే మోడీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న అనేక అంశాలను ఈ సభ ద్వారా వెల్లడించారు. నాగాయలంక టెస్టింగ్ రేంజ్ దుర్గా మాత లాగ రక్షణ రంగానికి శక్తినిస్తుందన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం పూర్తి పై కూడా మోడీ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి బాబు ఆకాంక్షిస్తున్నట్టుగా అమరావతిని మూడేళ్ళలో పూర్తి చేస్తే ఏపీ జీడీపీ గణనీయంగా పెరుగుతుందని, దానితో ఏపీ దశా దిశా పూర్తిగా మారిపోయి ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందని మోడీ ఆకాంక్షించారు.

అయితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం తోడైనట్టుగా, అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ఆ దేవుని ఆశీస్సులు లభించాయి అంటూ సీఎం చంద్రబాబు ఆ సభా కార్యక్రమానికి ఎటువంటి వర్ష గండం లేకపోవడాన్ని కొనియాడారు. ఎన్డీయే 2.0 తో, చంద్రబాబు 2040 విజన్ తో అమరావతి పునర్ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకుసాగాలని ప్రతి ఆంధ్రుడు ఆశపడుతున్నాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

4 seconds ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

28 minutes ago