ఉత్తరాది రాష్ట్రాల సేవలో తరిస్తున్న మోడీకి ఆంధ్ర ఎందుకు గుర్తుంటుంది?

నరేంద్ర మోడీ తాను భారతదేశానికీ ప్రధాన మంత్రిని అన్న సంగతి మర్చిపోయి ఉత్తర భారతం మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సేవలో తరిస్తున్నారు. ఈ నెల దేశవ్యాప్తంగా జరిగిన మూడు ఇన్వెస్టర్ మీట్లకు నరేంద్ర మోడీ హాజరయ్యి ఆయా రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేలా తన వంతు ప్రయత్నం చేశారు. ఒక దేశప్రధాని ఇటువంటి మీట్స్ కు వస్తే వచ్చే పాజిటివ్ ఫీల్ చెప్పలేనటువంటిది.

ADVERTISEMENT

మోడీ ఫిబ్రవరి 3న, అస్సాంలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో… ఫిబ్రవరి 18న మహారాష్ట్ర ఇన్వెస్టర్ సమ్మిట్ లో … ఫిబ్రవరి 21న ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొన్నారు. అయితే ఈరోజు నుండి విశాఖపట్నంలో ప్రారంభమయ్యే ఇన్వెస్టర్ సమ్మిట్ కు మాత్రం టైమ్ కుదరలేదు మన మోడీ గారికి.

రాష్ట్రప్రభుత్వం పిలవలేదు అంటారేమో. ఈ సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది వరసగా మూడవ సారి జరగడం. ఇప్పుడంటే టీడీపీ బీజేపీ సంబంధాలు చెడిపోయాయేమో గానీ, మూడు సంవత్సరాలలో ఎప్పుడూ మోడీ హాజరయ్యే ప్రయత్నం చెయ్యలేదు. మరి ఆంధ్రకు పెట్టుబడులు వస్తే క్రెడిట్ చంద్రబాబుకు వెళ్లిపోతుందనేమో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Another BO Winner Loading? Violence OK but Not Intimacy

After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…

15 minutes ago

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

5 hours ago