
ఈ సెంటిమెంట్ రీత్యానే మురుగదాస్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రంలోనూ నయనతారకు ఒక కీలక పాత్ర అప్పగించారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రిన్స్ మహేష్ బాబుతో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నయనతారను ఒక స్పెషల్ పాత్ర కోసం ఎంపిక చేసారట. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని, త్వరలోనే షూటింగ్ లో కూడా పాల్గొంటుందన్న సమాచారం ప్రిన్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది.
తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన నటించిన నయనతార, ఇప్పటివరకు ప్రిన్స్ సరసన నటించింది లేదు. గతంలో ఓ సినిమాకు సంబంధించి వీరిద్దరి కాంభినేషన్ హల్చల్ చేసినప్పటికీ, ప్రిన్స్ పక్కన నయన సూట్ కాలేదన్న టాక్ వినపడింది. అయితే నయనతార కెరీర్ ముగుస్తుందన్న తరుణంలో మహేష్ పక్కన అవకాశం రావడం సినీ వర్గాల్లో మరోసారి ఈ బ్లాక్ బ్యూటీ పేరు మారుమ్రోగేలా చేస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుండి ఒక అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అంతే కాకుండా బ్రాండ్ మెయింటెయిన్ చేయడానికి తెలుగు, తమిళ్ వెర్షన్స్ కి రెండు టైటిల్స్ కాకుండా ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…