
వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అరాచకాలలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటనే చెప్పాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైనా ఐపీస్ సునీల్ నాయక్ పై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హైద్రాబాద్ లో అరెస్టు చేసిన RRR ను ఏపీకి తరలించి ఆయనను అధికారులు కస్టడీకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో RRR పై అప్పటి అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారని, తన పై హత్యాప్రయత్నం కూడా జరిగిందని, కస్టడీ పేరుతో తనను కస్టోడియల్ టార్చర్ చేసారంటూ RRR కోర్టుకెళ్లారు.
ఇక అప్పటి నుంచి న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు సునీల్ కి నోటీసులు ఇవ్వడంతో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గతంలో కూడా సునీల్ కేసు విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో ఈసారి అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు.
ఇందుకోసం ఎస్పీ దామోదర్ బృందం బీహార్ వెళ్లగా అక్కడి హైకోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేయడానికి నిరాకరించింది. దీనితో ఈసారి కోర్టు వారెంట్ తో సునీల్ చుట్టూ బలమైన ఉచ్చు బిగిస్తున్నారు ఏపీ పోలీసులు. ప్రస్తుతం బీహార్ ఐజి గా బాధ్యతలు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ అరెస్టు విషయంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు గుంటూరు కోర్ట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ తీసుకున్నారు అధికారులు.
అయితే ఇప్పటికే సునీల్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఒక ఐపీస్ గా ఉండి ఒక ప్రజాప్రతినిధి పై కస్టోడియల్ టార్చర్ కు వెనుకాడని సోకాల్డ్ ప్రభుత్వ అధికారి ఇప్పుడు కస్టడీ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇలా అజ్ఞాతంలో అధికారులతో దాగుడు మూతలు ఆడుతున్నారు. నాడు తప్పు చెయ్యనేలా నేడు తప్పించుకుని తిరగనేలా అంటూ సునీల్ పై విమర్శలు మొదలయ్యాయి.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…
Mouli has become a familiar name through his social media work, web series and Little…