Telugu

ప్రభాస్ మీద ఏడిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం

ఒక సౌత్ ఇండియన్ హీరో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ని విస్తరించుకుంటూ పోవడం ఎందరికో మింగుడు పడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఈ కారణంగానే బాహుబలి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి. టి సిరీస్ లాంటి దిగ్గజ నిర్మాణ సంస్థ తన మీద వరసగా నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకుని ఏకంగా మూడు వేల కోట్ల దాకా పెట్టుబడి సిద్ధపడటం గతంలో ఏ ఖాన్లకు జరగలేదు. అంతెందుకు లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఇంత వైభవం చూడలేదన్నది వాస్తవం. అందుకే ఈ ఉలికిపాట్లు.

అలా అని టాలీవుడ్ లో అందరూ తనపట్ల హ్యాపీగా ఉన్నారని కాదు. పైకి నవ్వుతున్నా లోలోపల ఈర్ష్యతో రగిలిపోతున్న వాళ్ళు లేకపోలేదు. సరే పోటీపరంగా ఏం చేయలేం కాబట్టి ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి షూటింగ్ జరుగుతున్న వాటిని రహస్యంగా ఫోటోలు వీడియోలు ఏదోలా బయటికి రప్పించి సోషల్ మీడియాలో వదలడం. రెండోది పిక్స్ ని మార్ఫింగ్ చేసి ఇదిగో డార్లింగ్ ఇలా ఉన్నాడేంటి ఇలా అయ్యాడేంటని మీమ్స్ గట్రా చేయించి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయడం. ఇవన్నీ సత్యదూరంలో ఉన్నాయని సగటు జనాలకు అర్థం కాదు.

ADVERTISEMENT

ఇదంతా ఎదగడం చూసి ఓర్వలేని వ్యవహారమే. ప్రభాసే కాదు రాజమౌళి సైతం ఆస్కార్ రేంజ్ కి తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పటికీ సో కాల్డ్ నార్త్ సెలబ్రిటీలు కనీసం విష్ చేసిన పాపాన పోలేదు. దక్షిణాది దర్శకుడి వైభవాన్ని చూసి తట్టుకోలేని తనమిది. ఆర్ఆర్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు దూసుకుపోతున్నారు.ఇంటర్నేషనల్ మీడియా గుర్తించింది. ప్రధాని స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఇవన్నీ మాకే సొంతమని విర్రవీగుతూ వచ్చిన ఉత్తరాది స్టార్ల పిఆర్ టీమ్ లు వేస్తున్న ఎత్తుగడలు ఒకటా రెండా.

ఎంత చేసినా కొండమీద దూది ఉండలు విసిరినట్టు ఉంటుందే తప్ప ప్రభాస్ లాంటి వాళ్లకు ఊడేది పోయేది ఏమీ లేదు. ప్రభాస్ లుక్స్ పరంగా ఫిజిక్ పరంగా ఎలా ఉన్నాడో ఆ మధ్య లైవ్ ఫోటో షూట్ కు వెళ్లి ఫోటోలు తీయించుకుని ప్రత్యక్షంగా చూసిన ప్రతి అభిమానికి తెలుసు. కాకపోతే మాములు పబ్లిక్ కి ఇదంతా తెలియదు కాబట్టి డార్లింగ్ గురించి వస్తున్న ప్రచారాన్ని నమ్మేసే ఆవకాశం లేకపోలేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆన్ లైన్ ముప్పేట దాడులు మిగిలినవాళ్ళ మీద కూడా జరగొచ్చు. ఆకాశంపైకి రాయి పడేస్తే మేఘాలకు చిల్లు పడుతుందనుకోవడం అమాయకత్వం. ఈ ట్రోలింగ్ బ్యాచ్ చేస్తున్న పని ఇదే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Krishna Reaches Kuppam: Naidu’s Engineering Triumph

Krishna waters finally reach drought-hit Kuppam after travelling nearly 700 kilometres. It is a moment…

26 minutes ago

Keerthy Suresh Reveals an Uncomfortable Truth

Keerthy Suresh has made strong comments about some male actors she has worked with, revealing…

57 minutes ago