
‘డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. నేను చేసే పని, ధరించే దుస్తులు నా కుటుంబాన్ని ఏ విధంగానూ ఇబ్బంది కల్గించడం లేదు. కానీ, ఇతరులు మాత్రం స్పందిస్తున్నారు.. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్నే కాదు, నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు, అమర్యాదగా, అగౌరవంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ తో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు. బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే నాడు నేను ప్రశ్నిస్తున్నాను.. స్వేచ్ఛకు అర్థం ఇదా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? సంస్కృతీ సంప్రదాయాల పేరిట నా భావాలను, గౌరవాన్ని అణగదొక్కే స్వేచ్ఛ ఈ గూండాలకు ఉందా? ఇక, ఇలాగే జీవించాలా? ? ఏమీ చేయలేమా??’ అంటూ అనసూయ తన ఆవేదనను వెళ్లగక్కింది.
అయితే ఈ ట్వీట్ కు నెటిజన్ల నుండి భారీగా కౌంటర్లు వస్తున్నాయి. విమర్శలను స్వీకరించలేని వారు సోషల్ మీడియాలో ఉండడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ కాస్ట్యూమ్స్ ను ఉద్దేశిస్తూ నెటిజన్లు వ్యాఖ్యలు చేయడం ఈ బ్యూటీకి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అలాగే ‘జబర్దస్త్’లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు అనసూయ స్పందించే విధానం పట్ల కూడా వీరి మధ్య డైలాగ్ వార్ ను పెంచుతోంది.
Shah Rukh Khan’s King has reportedly secured the biggest overseas distribution deal ever for an…
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…