
‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా నటించబోయే సినిమాలో నిహారిక నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంతో బిజీగా ఉన్న నిహారిక, రెండవ సినిమా ఎంపికపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. నారా రోహిత్ సినిమాలంటే సహజంగా వినూత్నమైన కధలతో కూడుకుని ఉంటాయి. ఆ సినిమాలో ఒక కమర్షియల్ హీరోయిన్ గా కంటే, ఆఫ్ బీట్ హీరోయిన్ గా నటించే అవకాశాలే ఎక్కువ.
వాస్తవానికి నిహారికకు ఒక కమర్షియల్ హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాల కంటే, ఆఫ్ బీట్ సినిమాలలో వైరెటీ పాత్రలు చేసే లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాలు ఎన్ని చేసినా ప్రేక్షకులలో క్రేజ్ ను మాత్రం ఆశించలేం. ఒక రకమైన గౌరవభావంతో కూడిన గుర్తింపు లభిస్తుంది తప్ప, ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కు ఉండే ఫేం ఎప్పటికీ వచ్చే అవకాశం ఉండదు. మరి నిహారిక గమ్యం ఎటు వైపుకు ఎంపిక చేసుకుందో గానీ, నారా రోహిత్ సినిమా చేయడం అనేది మాత్రం విలక్షణతకు పెద్ద పీట వేయడమే!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…