
“అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట! రాయలసీమ బిడ్డనని చెప్పుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి సీమలో ఒక్క జిల్లాకు నీళ్ళు ఇచ్చారా?ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయించారా? కనీసం సొంత జిల్లా కడపకి, సొంత నియోజకవర్గం పులివెందులకైనా నీళ్ళు ఇవ్వగలిగారా?
జగన్ 5 ఏళ్ళ పాలనలో సీమ ప్రాజెక్టులలో తట్టెడు మట్టి కూడా తీయించలేదు. బస్తా సిమెంట్ ఖర్చు పెట్టలేదు. అలాంటి జగనా మా ప్రభుత్వాన్ని నిలదీసేది?” అని అడిగారు. ఇలా నిలదీసినవారు మరెవరో కాదు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
ఆయన నిబద్దత గురించి చెప్పుకునే ముందు సచిన్ టెండూల్కర్ గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. సచిన్ క్రికెట్ ఆటలో రాణించి మంచి పేరు, డబ్బు సంపాదించుకోవాలని కాకుండా, క్రికెట్ మీద మమకారంతో ‘ప్యాషన్’తో ఆడుతూ ఆటని ఎంజాయ్ చేసేవారు.
అందువల్లే ఆయనకు అంత పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చాయి. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అలాంటి ‘ప్యాషన్’తోనే పనిచేస్తుంటారు.
కూటమి ప్రభుత్వంలోనే మిగిలిన మంత్రులతో పోలిస్తే అయన పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. రైతుబిడ్డగా ఆయనకు సాగునీటి ప్రాజెక్టులు అంటే చాలా ఆసక్తి, మమకారం. అందుకే ఆయన స్వయంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులని స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
చేసే ప్రతీ ప్రాజెక్టు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, పనులు పూర్తి చేయాలనే తపన కలిగి ఉండటం, దాని కోసం ఎంత కష్టానికైన సిద్ధపడటం ఆయన అలవాటు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. వాటిపై ఓ పక్క తెలంగాణలో అధికార, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎంత రాజకీయాలు చేస్తున్నా, మరోపక్క రాష్ట్రంలో వైసీపీ ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా ప్రాజెక్టు పనులు ఆపడం లేదు. ఆగడం లేదు.
ఎందువల్లనంటే వాటిని పూర్తి చేసి కరువు పీడిత సీమ జిల్లాలకు త్రాగు, సాగు నీరు అందించాలనే పట్టుదల, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుకి ఉంది గనుకనే.
కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు త్రాగు,సాగు నీరు అందించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు నిన్ననే మార్కాపురం జిల్లాలోని రూ. 465 కోట్లు వ్యయంతో గంటవానిపాలెం వద్ద ఫీడర్ కెనాల్ (కాలువ) లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. జూన్ 15 నాటికి పనులు పూర్తిచేసి నీళ్ళు విడుదల చేయాలని డెడ్‌లైన్ కూడా పెట్టారు. అంటే పూర్తి బాధ్యత మంత్రి నిమ్మలదే కదా?
అలాంటి డెడ్‌లైన్లు పెట్టుకొని పనిచేసే అయన మండలిలో ఉండగా వైసీపీ సభ్యులు రాయలసీమ ప్రాజెక్టుల గురించి అడిగితే ఏమవుతుంది? అదే జరిగింది… వారికి మంత్రి నిమ్మల ఏవిధంగా సమాధానం చెప్పారో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…
Mouli has become a familiar name through his social media work, web series and Little…