Telugu

బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్స్ వచ్చేస్తున్నాయ్!

గత కొంత కాలంగా టాలీవుడ్ లో సినిమాలు హిట్టవుతున్నాయోమో గానీ, ఆడియోలకు మాత్రం పెద్దగా స్పందన రావడం లేదు. కానీ చాలాకాలం తర్వాత నాని హీరోగా తెరకెక్కిన “నిన్ను కోరి” ఆల్బమ్ కు అదిరిపోయే స్పందన లభించింది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ ఆడియో ‘బ్లాక్ బస్టర్’ టాక్ ను సొంతం చేసుకోగా, ఆ పాటలను సినిమాలో చిత్రీకరించిన విధానం మరింత ఆకట్టుకోవడంతో… ఆడియో పరంగానే కాక, వీడియో పరంగా కూడా చూడముచ్చటగా ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ‘సూపర్ హిట్’ సాధించిన ఈ సినిమా వీడియో సాంగ్స్ ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఆడియో మాదిరిగానే ముందుగా ‘అడిగా అడిగా…’ పాటను విడుదల చేయగా, తాజాగా ‘ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే…’ అన్న పాటను విడుదల చేసారు. ఈ ఆడియోలో హైలైట్ గా నిలిచిన పాటలలో ఇది ఒకటి కావడంతో వీక్షకుల నుండి స్పందన అదిరిపోయింది. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా రిలీజ్ చేయడంతో, సినీ అభిమానులు థ్రిల్ కు గురయ్యారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramlila Rally: Did Rahul Gandhi Win Over the INDIA Bloc?

For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…

14 minutes ago

Big B Behind Glass: Bollywood’s Changing Reality

The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…

44 minutes ago