
[m9ad]
ఏదో ఒకటి చెయ్యాలి…అయితే ఆ క్రమంలోనే కొత్త కధలపై నమ్మకం తగ్గిందో, లేక తమిళ సినిమాలపై భరోసా వచ్చిందో ఏమో తెలీదు కానీ, మొత్తంగా నితిన్ ఒక తమిళ సినిమా మాయలో పడ్డాడు అని మాత్రం అర్ధం అవుతుంది. తమిళ్ లో విష్ణు విశాల్ హీరోగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న ‘రాక్షసన్’ సినిమా పై పడింది నితిన్ కన్ను. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ ని నితిన్ కొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంచి రొమ్యాంటిక్ హీరో అయిన నితిన్, మంచి మాస్ ఇమేజ్ ఉన్న నితిన్, ఇటువంటి సినిమా చెయ్యాలి అన్న ఆలోచన రావడం సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా పక్కా సస్పెన్స్ థ్రిల్లర్. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్ప్లే తో సాగుతుంది.
ఇక మరో పక్క తెలుగు ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. అందుకేగా మన తెలుగులో అడవి శేషు లాంటి రచనా దర్శకులు అలాంటి సినిమాలు తీస్తూ మంచి హిట్స్ సాధిస్తున్నారు. ఇక భారీ హిట్ కోసం ఆశపడుతున్న నితిన్ తన కమర్షియల్ ఫార్మ్యాట్ రూట్ మార్చి ఈ సినిమాలో నటిస్తాడో. లేక హక్కులను కొన్నాడు కనుక తనకు నచ్చిన మాస్ టచ్ ఇచ్చి సినిమాను మన ముందుకు తీసుకొస్తాడో తెలీదు కానీ. మొత్తంగా అయితే ఈ సినిమాని నితిన్ తన వైపు నుంచే తెలుగులో వచ్చేలా పక్కాగా ప్లాన్ చేసుకునట్లు టాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో చిన్న విషయం ఏంటి అంటే, నితిన్ మనసు మార్చుకుని తన జొనర్ సినిమా కాదు అని అనుకుని, ఈ సినిమాకి కేవలం నిర్మాతగా వ్యవహరించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటున్నాయి సినిమా వర్గాలు. మరి నితిన్ మాట…నితిన్ రూట్ ఏంటో చూద్దాం.
The Supreme Court’s hearing on the Andhra Pradesh municipal elections could change the fate of…
Chiranjeevi is reportedly preparing to enter a new space with his talk show MEGAVerse for…