
సినీ ఇండస్ట్రీలో సక్సస్ మాత్రమే కనిపిస్తుంది, వినిపిస్తుంది, మాట్లాడుతుంది అనేది ముమ్మాటికీ వాస్తవం. కార్తికేయ -2 వంటి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ ఆ తరువాత ఆ సక్సెస్ భారాన్ని మోయలేక చతికిలబడ్డారు.
ఇక ఆ తరువాత వచ్చిన నిఖిల్ 18 పేజస్, స్పై , అపుడో ఇపుడో ఎపుడో సినిమాలు నిఖిల్ కెరీర్లో హ్యాట్రిక్ అపజయాలను అందించాయి. ఈ ఏడాది చివరిలో వచ్చిన అపుడో ఇపుడో ఎపుడో మూవీ థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా పేక్షకులకు తెలియలేదు. కనీసం ఓటిటి ప్రేక్షకులను కూడా ఈ మూవీ అలరించలేకపోయింది.
ఇక 2020 లో వచ్చిన భీష్మ తో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ ఇప్పటికి మరో విజయాన్ని ఆస్వాదించలేకపోయారు. భీష్మ తో తన కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన నితిన్ ఇక ఆతరువాత వచ్చిన అపజయాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. చెక్, రంగదే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్సట్రాడినరీ వంటి సినిమాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు నితిన్.
వరుస అపజయాలతో ఫేమ్ కోల్పోయిన ఒకప్పటి ఇండస్ట్రీ హిట్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనను తానూ నిరూపించుకోవడనికి ఒక కంబ్యాక్ మూవీ గా తీసిన ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేని ని మాస్ హీరోగా ప్రజంట్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
అయితే పూరీ, రామ్ కాంబోలో వచ్చిన ఈ ఇస్మార్ట్ శంకర్ మూవీ సక్సెస్ రామ్ సినీ కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళుతుంది అనుకున్న రామ్ కు ఆ విజయం తరువాత వరుస పరాభవాలే ఎదురయ్యాయి. రెడ్, ద వారియర్, స్కంధా, డబుల్ ఇస్మార్ట్ అంటూ నాలుగు వరుస డిజాస్టర్లు అందుకుని తన అభిమానులకు నిరాశను కలిగించారు రామ్.
అయితే ఇపుడు చూసిన ఈ ముగ్గురి అపజయాలు వెనుక ఒక భారీ సక్సెస్ ఉంది. అంటే ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఎంత కష్టమో ఆ వచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకోవడం, దాన్ని కొనసాగించడం కూడా అంత కంటే పెద్ద కష్టం అనేది సుస్పష్టమవుతుంది.
ఒక విజయం ఇన్ని ఓటములను తట్టుకునేలా బలాన్ని ఇవ్వగలుగుతుందా అన్నట్టుగా ఈ ముగ్గురి సినీ కెరీర్ సాగుతుంది. 2025 లో రాబోతున్న నితిన్ రాబిన్ హుడ్, నిఖిల్ స్వయంభు, రామ్ సినిమాలు మంచి విజయాలను అందుకుని వారి కెరీర్ గాడిన పడాలని, తెలుగు చిత్ర పరిశ్రమ మరింత ముందుకెళ్లాలని ఆశిద్దాం.
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…