
దీంతో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “లై” సినిమా వెనక్కి తగ్గడం ఖాయం అన్న టాక్ బలంగా హల్చల్ చేసింది. 14 రీల్స్ సంస్థలో నిర్మించబడిన ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత అనిల్ సుంకర అధికారికంగా డిక్లేర్ చేయడంతో… త్రిముఖ పోటీ తప్పేలా లేదు. నితిన్ మంచి నటుడే గానీ, ప్రేక్షకులలో క్రేజ్ మాత్రం అంతంతే. దీనికి తోడు డైరెక్టర్ హను రాఘవపూడి కావడంతో, ఈ సినిమాపై బజ్ అంతగా ఏర్పడలేదు. కానీ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం “లై” టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
మరి ఈ మూడు చిత్రాలలో ‘విన్నర్’ ఎవరు అవుతారు? ట్రేడ్ టాక్ ప్రకారం… మూడు సినిమాలు బాగానే వచ్చాయని తెలుస్తుండగా, బోయపాటి మాత్రం తన మాస్ మేనరిజమ్స్ తో మరోసారి మెస్మరైజ్ చేస్తారని భావిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి ‘లై’ క్లాస్ అండ్ స్టైలిష్ గా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాలలో మంచి టాక్ వ్యక్తమవుతోంది. ఇక రానా – తేజల “నేనే రాజు నేనే మంత్రి” సినిమా పొలిటికల్ నేపధ్యం కావడంతో, మిగిలిన సినిమాల కంటే ప్రేక్షకులను ఇది ఎక్కువగా ఆకర్షిస్తోంది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…