
ఫస్ట్ టాక్ యుఎస్ నుండి బాగానే ఉందని వచ్చిందని, అయితే ఇక్కడ మాత్రం ఎక్కువ శాతం మంది నిరుత్సాహపడ్డారని, అయితే ఈ టాక్ రెండవ రోజు నుండి తగ్గుముఖం పడుతూ వచ్చిందని… ఎక్కువ మంది సంతృప్తి చెందుతూ, తక్కువ మంది అసంతృప్తి పాలవుతున్నారని, రానున్న రోజుల్లో అది పూర్తిగా పోతుందో లేదో చూడాలని, ఈ సినిమా హిట్టయినా, కాకున్నా ఒక్కటి మాత్రం తాను చెప్పింది జరిగిందని… దర్శకుడు హను రాఘవపూడి, హీరోయిన్ తదితరులకు మంచి పేరు వస్తుందని చెప్పానని, అలాగే వారికి మంచి పేరు రావడం సంతోషం కలిగించిందని అన్నారు.
‘అ…ఆ…’ వంటి భారీ విజయం తర్వాత ఏ కమర్షియల్ సినిమా తీసినా సేఫ్ సైడ్ లో ఉండవచ్చు గానీ, తాను రఫ్ రోడ్డును ఎంపిక చేసుకున్నానని, అందువలన ప్రేక్షకులు అంగీకరించడానికి కొంత సమయం పడుతుందేమోనని అన్న నితిన్ వ్యాఖ్యల్లో అసలు ఉత్సాహమే లేదు. మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడడంతో, కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా తెరకెక్కిన “లై” సినిమా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోతోంది అన్న మాట వాస్తవమే. ఆ ఫలితం నితిన్ ముఖకవళికల్లో స్పష్టంగా కనపడుతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…