
అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే ప్రతిపక్షానికి తన గళం వినిపించే అవకాశం ఉంటుంది. ప్రజలంతా దానిని ఆసక్తికరంగా గమనిస్తారు. అలంటి చక్కటి అవకాశాన్ని జగన్ చేతులారా పోగొట్టుకున్నారు. ప్రతిపక్షం లేకపోవడంతో ప్రభుత్వం తను చెప్పాల్సింది చెప్పుకుపోయి, కావలసిన బిల్లులను ఆమోదించుకుంటుంది.
అయితే ఈ చెత్త నిర్ణయాన్ని ఆ పార్టీ మరియు వారి మీడియా సమర్ధించుకునే పనిలో పడింది. తెలుగుదేశం ప్రభుత్వం బహిరంగంగా చేస్తున్న ఫిరాయింపుల పర్వంపై దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి జగన్ ఎత్తుగడ ఫలించిందంట. ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి ఇది ఆస్కారం ఇచ్చిందట.
కాబట్టి జగన్ నిర్ణయం సఫలం అయినట్లే అని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. దీని గురించి జాతీయ మీడియాలో గాని జాతీయ స్థాయిలో గాని ఇప్పటిదాకా చర్చ జరిగింది లేదు. కనీసం ఆ పార్టీ నాయకులు కూడా జాతీయ మీడియాలో దీని గురించి మాట్లాడింది లేదు. ఈ వైఖరి చూస్తుంటే నిర్ణయం అంటూ తీసుకున్నాం కాబట్టి ఏదో రకంగా సమర్దించేసుకుందాం అన్నట్టు ఉంది ఆ పార్టీ వ్యవహారం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…