
గతంలో ‘శ్రీమంతుడు’ సినిమా సందర్బంలో విడుదలకు ముందు, మహేష్ స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దాని ఫలితం బాక్సాఫీస్ వద్ద కనిపించింది కూడా! అలాగే ‘బ్రహ్మోత్సవం’కు కూడా ఆ స్థాయి కాకపోయినా, కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోట్ చేసారు. కానీ ‘స్పైడర్’ విడుదలకు కేవలం నాలుగు రోజులే ఉన్న దరిమిలా కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాకపోవడం అనేది, సినిమాపై అంచనాలను తగ్గించడానికేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
భారీ అంచనాలు సినిమాలను బాగా దెబ్బ తీస్తున్నాయన్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు జరుగుతున్న హంగామాతోనే ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆదివారం నుండి మీడియా ఛానల్స్ లో మహేష్, రకుల్, మురుగదాస్ ఇంటర్వ్యూలు ఉంటాయని సమాచారం లభిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన ప్రోమోలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. అంచనాలను తగ్గించాలన్న సిద్ధాంతం సరైనదే గానీ, అసలు ఏ మాత్రం పబ్లిసిటీ చేయకపోతే, సినిమా ఏ విధంగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది?
తెలుగులో మహేష్ మరియు తమిళంలో మురుగదాస్ ల పేర్లు కొంతవరకు ఉపయోగపడినా… రికార్డు ఓపెనింగ్స్ రావాలంటే సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేయాల్సిందే. “బాహుబలి 2” విషయంలో రాజమౌళి అనుసరించిన ప్రణాళిక ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. అయితే అంతలా ప్రమోట్ చేయాలంటే, ముందుగా తాము తీసిన సినిమాపై చిత్ర యూనిట్ వర్గాలకు అంత నమ్మకం కూడా ఉండాలి. ‘స్పైడర్’ విషయంలో అదే లోపించిందా? ట్రైలర్ ఈ విషయాన్ని బలపరుస్తున్నా… మహేష్ – మురుగదాస్ కాంబో పైన ఏదో నమ్మకం అందరిలోనూ ఉంది. అదే ‘స్పైడర్’కు కొండంత అండ!
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…