
బీజేపీ అధిష్టానం తిరుపతి, రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, అరకు ఎంపీ సీట్లకు అభ్యర్ధులు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది.
తిరుపతి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వర ప్రసాద్ లేదా రత్నప్రభ, రాజంపేట: మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం: మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజమండ్రి: దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి: సిఎం రమేష్, అరకు: కొత్తపల్లి గీత పేర్లు ఖరారు అయిన్నట్లు తెలుస్తోంది.
ఎంపీ సీట్లు ఆశిస్తున్న సీనియర్ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్, పీవీఎన్ మాధవ్ ముగ్గురికీ శాసనసభ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటి రెండు రోజులలో ఏపీ బీజేపీ అభ్యర్ధుల జాబితా వెలువడి పూర్తి స్పష్ఠత వస్తుంది.
ఒకవేళ నర్సాపురం ఎంపీ సీటుకి గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మకి ఖాయం చేసేస్తే, రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏమిటి? టిడిపి, జనసేనలు ఇప్పటికే తమకు దక్కిన వాటిలో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించేశాయి. కనుక వాటి తలుపులు కూడా మూసుకుపోయిన్నట్లే. మరి ఆయన ఏం చేస్తారో?
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…