
ఓ ప్యూన్ ఉద్యోగానికి కనీసం ఏడో క్లాసు పాస్ అయ్యుండాలి… కలెక్టర్ అయితే ఐఏఎస్ అయ్యుండాలి… అలాగే వైసీపి మంత్రి పదవి లేదా ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, నాలుగు బూతులు మాట్లాడాలి… ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడుతుండాలి.
లేకుంటే అటువంటి వాళ్ళన్ని ఎలా ‘ఓన్’ చేసుకోగలను?ఎలా టికెట్ ఇవ్వగలను? అని జగన్మోహన్ రెడ్డి తనను అడిగారని వైసీపి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
వైసీపిలో నుంచి బయటకు వస్తున్న ప్రతీ ఒక్కరూ ఇదే మాట చెపుతుండటం గమనిస్తే మంత్రిపదవులు, టికెట్లకు ప్రధాన అర్హత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను తిట్టడమే అని స్పష్టం అవుతోంది.
తాజాగా పక్కన పెట్టబడిన వైసీపి సీనియర్ నేత, కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల విషయంలో ‘సాఫ్ట్’గా ఉంటే కుదరదని జగన్ తనకు కబురు పంపారని అన్నారు.
కానీ తాను తన ప్రత్యర్ధులను రాజకీయంగా ఎదుర్కోవడానికే ఇష్టపడతానని, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం తనకు నచ్చదని జవాబు చెప్పడంతో, జగన్ తనను పక్కన పెట్టి అరవిందా యాదవ్‌ని నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు జగన్ తనను పక్కనపెట్టి అవమానించిన్నట్లుగానే ఈవిదంగా వ్యవహరించడం చాలా బాధ కలిగించిందని, టికెట్ల కోసం ఎవరినో తిట్టడం అనే కొత్త పద్దతిని తాను పాటించలేనని మహీధర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. జగన్ తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను సొంత బలంతోనే నియోజకవర్గంలో గెలవగలనని మహీధర్ రెడ్డి చెప్పారు.
Palak Tiwari makes a striking case for unapologetic pink in this vibrant saree photoshoot. Her…
Following the terrible failure of Retro, Karthik Subbaraj has made a comeback with the film…