జగన్ మామ ప్రభుత్వంలో దళితుల మీద ఆగని దాడులు!

దళితుల మేనమామ, దళితుల పక్షపాతి ఈ జగన్ మామ అంటూ దద్దరిల్లే బ్యాక్ గ్రౌండ్ వేస్తూ ప్రచారం చేసే ఈ వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగే దాడులను ఎందుకు ఆపలేకపోతున్నారో ఒక్కసారి ప్రజలకు వివరించాలంటూ టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు వైసీపీ నేతలను, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను ప్రశ్నిస్తున్నారు.

కొవ్వూరు జిల్లా దొమ్మేరులో దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకున్న వైనం పై రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనితకు నిరసన సెగ తగిలింది. మహేంద్ర మరణం పై స్పందిస్తూ జెడ్పిటిసి బొంత వెంకటలక్ష్మి ఆమె భర్త బొంత పోసుబాబు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లడంతో అవమాన భారం తట్టుకోలేక మహేంద్ర బలవన్మరణానికి పూనుకున్నాడు అంటూ తమ గోడువెళ్లబోశారు.

ADVERTISEMENT

దీని పై తగిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి అనితకు సమాచారం అందించినా సరైన సమయంలో మంత్రి స్పందించకపోవడంతో ఈ ఘోరం జరిగిపోయిందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు వెంకట లక్ష్మి దంపతులు.చేతులు కాలాక ఆకులూ పట్టుకుంటే ఫలితం ఏముంటుంది? అంతా అయిపోయిన తరువాత వచ్చి పరామర్శలు చేస్తామంటే ఎలా? ఇదేనా మీ ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఉండే ఆదరణ అంటూ తానేటి వనితను అడ్డుకున్నారు స్థానిక బాధిత కుటుంబసభ్యులు.

సొంత బావ కొడుకునే రక్షించుకోలేని నేను ఇక సామాన్యులకు ఎటువంటి న్యాయం చేయగలను అంటూ వెంకట లక్ష్మి వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ తరుపున పని చేసే మాకే ఇటువంటి పరిస్థితి ఎదురయితే ఇక సామాన్యులకు ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందా? అనేది సందేహమే అంటూ ప్రభుత్వంపై,హోమ్ మంత్రి పై తీవ్ర విమర్శలు చేసారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు నానాటికి పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం అంటూ వ్యాఖ్యనిస్తున్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. దళితులను హత్య చేసిన నేరస్తులకు సీఎం జగన్ పదవులను కట్టబెటుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరుగుతుందా? జగన్ మామ ప్రభుత్వంలో అంతే అనుకుని సరిపెట్టుకోవాల్సిందేనేమో.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Varsha Gives Rain Fashion A Bold Upgrade!

Varsha Rekhate turns a rainy backdrop into a style moment in this striking gallery. Dressed…

25 minutes ago

Ramayana Marketing Disaster: Why Promotions Gone Silent?

Nitesh Tiwari’s Ramayana is scheduled to arrive in theatres in Diwali 2026. With a few…

45 minutes ago