
ఏపీ సీఐడీ పక్క రాష్ట్రమైన హైద్రాబాద్ లో కూడా తన అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుంది. తాజాగా టీడీపీ ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి ని ఏపీ సిఐడి అధికారులు పక్క రాష్ట్రమైన తెలంగాణ వెళ్ళి మరి అరెస్టు చేసి ఏపీలోని గుంటూరు సిఐడి ఆఫీస్ కు తరలించారు.
తన తల్లి ఆర్యోగ్యం సరిగాలేదనే కారణంగా తల్లిని పరామర్శించడానికి అమెరికా నుండి తన సొంతఊరు వెళ్లాలనుకున్న ఎన్నారై యష్ పై అక్రమ కేసులు పెట్టి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేయడం వైసీపీ దుశ్చర్య అంటూ నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు అరెస్టును ఖండించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ పాలనా విధానాలను విమర్శిస్తూ జగన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కాను యష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు సిఐడి అధికారులు. దీని పై ఆయన స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నా పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. దీనితో తన ప్రశ్నించే గొంతుని అణిచివేయాలని చూస్తున్నారు. అది ఎన్నటికీ సాధ్యం కాదని, వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీకి మద్దతుగా అందరు నిలబడాలని కోరుకుంటున్నా అన్నారు.
తన తల్లి అనారోగ్య సమస్యలతో భాద పడుతుందని కనీసం తన తల్లిని కూడా కలవనీయకుండా వైసీపీ ప్రభుత్వం, అధికారులు తనని అరెస్టు చేయడం దారుణం అంటూ తన ఆవేదనను వ్యక్త పరిచారు యష్. అలాగే ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడడానికి, నీ సైకో చేష్టలు కొనసాగించడానికి మరొక వంద రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఆ తరువాత అట్టుకు అట్టున్నర తిరిగి చెల్లిస్తామని లోకేష్ చాల ఘాటుగా బదులిచ్చారు.
కేవలం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒక తీవ్రవాదిని అరెస్టు చేసిన పంధాలో ఒక ఎన్నారై కార్యకర్తను అరెస్టు చేసిన ఏపీ సిఐడి అధికారులకు దళితులను, ఎస్సి, ఎస్టీ లను నోటికొచ్చిన బూతులు తిట్టిన వైసీపీ ఎన్నారై కార్యకర్తల చేష్టలు కనపడలేదా..? చివరికి వారి విమర్శల దాడి న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కూడా చేరాయి. అయినా వాటి పై కనీస స్పందన కూడా కరువయ్యింది.
ఇక ప్రతిపక్ష నాయకుల మీద విమర్శల సంగతి చెప్పనక్కరలేదు అనే విధంగా కొనసాగుతుంది. అయినా కూడా అటు వైసీపీ పార్టీ నుండి కాని ఇటు వైసీపీ ప్రభుత్వం నుండి కానీ ఇలా ఎయిర్ పోర్టులలో అరెస్టులు చేసే అధికారుల నుండి కూడా ఒక్క వ్యతిరేక ప్రకటన రాకపోవడం చూస్తుంటే అరెస్టు చేయడానికి వీరికి వేరే కారణం ఏమి అక్కరలేదు. కేవలం వారు టీడీపీ కార్యకర్త అయితే చాలా.? అన్నటుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటూ ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…