హమ్మయ్య… ముతక స్టైల్ పక్కన పెట్టిన ఎన్టీఆర్!

NTR at Hyderabad Airport After Shooting RRR at Ukraineఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. ఈ జనరేషన్ హీరోలలో రామ్ చరణ్ ను పక్కన పెడితే మిగతా వాళ్లలో ఎన్టీఆరే యంగ్. రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కంటే ఏడాదిన్నర చిన్నోడు. అయితే ఎన్టీఆర్ చేసిన పెద్ద తరహా పాత్రల వల్ల కావొచ్చు ఇంకో విషయం వల్ల కావొచ్చు లేని పెద్దరికం ఎన్టీఆర్ లో కనిపిస్తుంది.

అది చాలదు అన్నట్టు ఎన్టీఆర్ కూడా వయసుకు తగ్గట్టు స్టైలింగ్ ఉండదు. వెయిట్ తగ్గి… కండలు పెంచాకా కూడా బయట ఎప్పుడు కనిపించినా ఫార్మల్ షర్ట్స్ లోనే బయటకు వస్తాడు. అందులోనూ ఎక్కువగా బ్లాక్ షర్ట్లు.ఆ కారణంగా ట్రెండీగా స్టైలిష్ గా కనిపించడం మానేసి ఇంకాస్త వయసు కనిపిస్తుంది.

ADVERTISEMENT

మరోవైపు… రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు రకరకాల ఫ్యాషన్లతో స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు నిత్యం. ఆ విషయంగా ఎప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు లోటే. అయితే మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ వారి మొర ఆలకించినట్టు గా కనిపిస్తుంది. ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎన్టీఆర్… వైట్ ఫుల్ హాండ్స్ టీషర్ట్, టార్న్ జీన్స్ తో స్టైలిష్ గా కనిపించాడు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అతని స్టైలిష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అయిపోయి మురిసిపోతున్నారు. పనిలో పనిగా మా హీరోని ఇలానే స్టైలిష్ గా చూపించమని #NTR30 టీమ్ కు ట్వీట్లు వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories