
‘ఫస్టాఫ్ – యావరేజ్, సెకండాఫ్ – బ్లాక్ బస్టర్’ అంటోంది సోషల్ మీడియా. ‘జనతా గ్యారేజ్ ఇన్ సైడ్ టాక్’ అంటూ హల్చల్ చేస్తోన్న ఈ సమాచారం ఎంతవరకు వాస్తవమో, సినిమా విడుదలైతే గానీ తెలియదు. కానీ, ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమాకు ఇలా ‘ఇన్ సైడ్ టాక్’లు పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, తీరా అవి ధియేటర్ల దగ్గరికి వచ్చేపాటికి పూర్తి స్థాయి నెగిటివ్ రిపోర్ట్ రావడం షరామామూలు అయిపోయింది.
‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి’ వంటి పెద్ద సినిమాలకు ఇలా ప్రీ రిలీజ్ టాక్, సెన్సార్ టాక్ ల పేరుతో ‘సినిమా అదిరిపోయింది’ అన్న సమాచారం హల్చల్ చేసిన వైనం తెలిసిందే. కానీ, బొమ్మ పడిన తర్వాత అంతా తారుమారు అయిన వైనం కూడా గమనించదగినదే. మరి ‘జనతా గ్యారేజ్’ విషయంలో ప్రస్తుతం వినపడుతున్న టాక్ లో ఎంతమేరకు వాస్తవం ఉందో సెప్టెంబర్ 1వ తేదీన తేలిపోనుంది.
BOTTOM LINE Normal Mode Works, God Mode Fails RATING 2.25/5 Director: RJ Balaji Story, Screenplay:…
Virat Kohli has finally addressed the growing discussions surrounding his retirement plans and the possibility…