
ఓ బ్యాగ్ ని తగిలించుకుంటూ రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పిక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. గడ్డం, పైకి లేపిన హెయిర్ స్టైల్ తో జూనియర్ నడిచి వస్తున్న తీరు ఆకట్టుకునే విధంగా ఉండడంతో, అభిమానులు నూతన ఉత్సాహంతో వీక్షిస్తున్నారు. అలాగే జూనియర్ వెనుక ఒక వైపు బ్రహ్మాజీ, మరో వైపు అజయ్ లు నడుస్తున్న తీరు కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో… అభిమానుల అంచనాలు రెట్టింపవుతున్నాయి.
టీజర్ తో ఫ్యాన్స్ మదిని కొల్లగొట్టిన జూనియర్, ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులు బద్దలు కొడతాడని అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ‘టెంపర్’ నుండి మారిన జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై కనిపిస్తుండడం, ఈ ఏడాది ఇప్పటికే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో మరో విలక్షణతను చూపించడంలో సక్సెస్ కావడంతో, ఈ మాస్ “జనతా గ్యారేజ్” ఒక ఊపు ఊపడం ఖాయమని భావిస్తున్నారు. మరి ఆ రేంజ్ ను అందుకుంటుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు వేచిచూడాల్సిందే.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…