
అయితే ప్రిన్స్ అభిమానులకు ‘దూకుడు, శ్రీమంతుడు’ వంటి సినిమాలు అందించిన అనుభూతిని.., అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ‘అత్తారింటికి దారేది’ సినిమా అందించిన ఫీలింగ్స్… జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లేకపోయాయి. దీంతో ఒకప్పుడు టాప్ చైర్ రేసులో ముందులో ఉన్న తారక్, పూర్తిగా వెనుకబడడం అభిమానులకు పూర్తిగా నిరాశ కలిగించే అంశం. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కంటే వెనుక వచ్చిన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్న తీరు కూడా ‘బుడ్డోడు’ను మరింత వెనక్కి నెట్టింది.
కానీ, ‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో, గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలకు రానటువంటి క్రేజ్ “జనతా గ్యారేజ్” సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్స్ పై పడనున్న బొమ్మకు ఎలాంటి స్పందన వస్తుందోనని జూనియర్ అభిమానులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే… టాప్ చైర్ రేసులోకి మహేష్, పవన్ లతో పాటు రావాలంటే ఈ సినిమా ఖచ్చితంగా రికార్డుల రిపేర్లు చేయాల్సిందే!
ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ కు లభించే చివరి అవకాశంగా భావించవచ్చు. ఈ సినిమా తర్వాత జూనియర్ సినిమాల దర్శకుల జాబితాను పరిశీలిస్తే… ‘జనతా గ్యారేజ్’పై వచ్చిన నమ్మకం, హైప్ రాకపోవచ్చు. కొరటాల – మోహన్ లాల్ – జూనియర్ ఎన్టీఆర్ – దేవిశ్రీప్రసాద్ – తిరుల కలయికతో, ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదల కానున్న “జనతా గ్యారేజ్” అభిమానులకు ఎలాంటి అనుభూతులను కలిగించిందో తెలుసుకోవాలంటే… చూస్తూనే ఉండండి… ‘మిర్చి9.కాం’
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…