Telugu

‘జనతా గ్యారేజ్’లో తారక్ ఫస్ట్ లుక్ లీక్!

‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ సినిమాలతో మాంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్.’ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభానికి ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో రికార్డు స్థాయి బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టి సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను కూడా వేసారు.

ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందా? అన్న ఆతృత అభిమానుల్లో వ్యక్తమవ్వడం సహజమే. అలాంటి వారి కోసమే తాజాగా సోషల్ మీడియాలో ఓ లుక్ హల్చల్ చేస్తోంది. గడ్డంతో ఎటువంటి హంగామా లేనటువంటి ఓ సాదా సీదా చొక్కాతో దర్శనమిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడికి వచ్చిన అభిమానులతో కలిసి ఫోటోలు దిగిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చింది. ‘శ్రీమంతుడు’ మాదిరే ‘జనతా గ్యారేజ్’ స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తుండడంతో ఇటు అభిమానుల్లోనూ, అటు ట్రేడ్ వర్గాల్లోనూ ‘జనతా గ్యారేజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 12వ తేదీన వీటన్నింటికి సమాధానం లభించనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

2 minutes ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

5 minutes ago