
రాజమౌళి తన ‘డ్రీం ప్రాజెక్ట్’గా ‘మహాభారతం’ సినిమాను అభివర్ణించిన విషయం తెలిసిందే. దీని గురించే ఈ దర్శక ధీరుడు చెప్పినట్లుగా ఈ వార్తల సారాంశం. జూనియర్ ఎన్టీఆర్ లేని “మహాభారతం” ఉండదని, మహాభారత కథతో తాను త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆరే హీరో అని రాజమౌళి తన స్నేహితులతో అన్నట్టు ఫిలింనగర్ టాక్. బాహుబలి సినిమాతో భారీ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న రాజమౌళి అంతకుమించిన భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
‘మహాభారతం’లోని కథతో సినిమాను తెరకెక్కించనున్నట్టు గతంలో పలు సందర్భాల్లో రాజమౌళినే చెప్పడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అందులో భాగంగా వివిధ పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. ఆ సినిమాలో మాత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆరే హీరో అని, ఆయన కోసం అందులో కొన్ని పాత్రలు వున్నాయని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Vijay was sworn in as the Chief Minister of Tamil Nadu on May 10 at…
Salman Khan’s upcoming superhero film with director duo Raj & DK has already created strong…