
“నాన్నకు ప్రేమతో” సినిమా గురించి ప్రత్యేకంగా ఈ షో లో మాట్లాడనున్నాడు జూనియర్. అలాగే అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించనున్నారు, “గుండమ్మ కధ”పై ఓ ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా సంక్రాంతి పర్వదినాన ఈ కార్యక్రమం ప్రసారమయ్యే అవకాశం ఉంది.
“నాన్నకు ప్రేమతో” సినిమా పబ్లిసిటీకి అనువైన అన్ని వనరులను జూనియర్ పూర్తిగా వినియోగించుకుంటున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల మీడియాకు ప్రత్యేక విందు ఇవ్వగా, తాజాగా బుల్లితెరపై ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్స్ తెచ్చుకుంటున్న కార్యక్రమంలో పాల్గొని, బుల్లితెర ప్రేక్షకులను కూడా తన వైపుకు తిప్పుకోవాలని జూనియర్ చేస్తున్న ప్రయత్నానికి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మొత్తమ్మీద తన 25వ సినిమా బంపర్ హిట్ కావడానికి జూనియర్ ఎన్టీఆర్ చాలా పట్టుదలతో ఉన్నట్లు కనపడుతోంది.
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…