
అనంతరం, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘నాకు ఎప్పటి నుంచో దర్శకుడు జగన్ గారితో కల్యాణ్ అన్న కలిసి చేయాలని అనుకునేవాడిని. ‘టెంపర్’ చేసిన తర్వాత నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికి కారణం జగనే. ఆయనతో కలిసి పనిచేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే, ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక, మా అన్న గురించి మాట్లాడాలంటే.. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.. తనకు అన్నీ అతనే. ఒక నటుడిగా ఈ సినిమా కోసం అన్న చాలా కష్టపడ్డాడు. ఏ విషయంలోనైనా కష్టపడితే ఆ ఫలితం విజయం రూపంలో మనకు దక్కుతుంది. ఈ చిత్రం ద్వారా అన్న విజయం సాధించాలి’ అని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ఇక, ‘ఇజం’ చిత్ర హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కు వెళిపోదామా అనిపిస్తుండేదని, అంత ఉత్సాహం తమకు రావడానికి కారణం దర్శకుడు పూరీ జగన్నాథ్ అని అన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా చేశామని, ఆ ఉత్సాహం ఎలా ఉందంటే, పూరీ జగన్నాథ్ తో మళ్లీ వెంటనే ఇంకో సినిమా చేయాలనేంతగా ఉందని అన్నారు కల్యాణ్ రామ్.
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…