ఇండియన్ సెన్సార్ బోర్డ్ ని తిట్టిపోస్తున్న తెలుగు యువత..

మన భారతీయ సెన్సార్ వ్యవస్థ మీద చాలామందికి చాలా రకాల కోపాలు ఉన్నాయి. కొందరు సీనియర్ డైరెక్టర్లు అయితే అసలు సెన్సార్ బోర్డ్ వ్యవస్థ మరియు వాళ్ళు ఫాలో అవుతున్న రూల్స్ చాలా పాతవని, ప్రస్తుత తరానికి సంబంధించినవి కావని తమ కోపాన్ని వెళ్లగక్కారు. ఇంకొందరైంతే.. సెన్సార్ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని, ఆ బోర్డులో కేవలం ఫిలిం మేకర్స్ మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డారు.

అయితే.. నిన్నటినుండి తెలుగు యువత కూడా సెన్సార్ బోర్డ్ పనితీరు మీద మండిపడుతున్నారు. అందుకు కారణం “అబ్సెషన్” అనే హాలీవుడ్ చిత్రం. 7 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి వందల కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇండియాలో నిన్న రిలీజ్ అయ్యింది. హారర్ సినిమా కావడంతో A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈమధ్య A సర్టిఫికెట్ సినిమాలంటే ఇష్టపడుతున్న యువత మొత్తం థియేటర్లకి వెళ్లిపోయారు.

ADVERTISEMENT

కట్ చేస్తే.. ఇండియన్ సెన్సార్ బోర్డ్ సినిమాలోని కీలకమైన సన్నివేశాల్ని, అది కూడా హారర్ కి సంబంధించిన సీన్స్ ను కట్ చేశారు, కొన్నిటిని బ్లర్ చేసారు. కట్ చేసిన ఫుటేజ్ తక్కువే అయినప్పటికీ.. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కి అవి చాలా కృషియల్ అని, A సర్టిఫికెట్ ఇచ్చాక వాటిని కట్ చేయాల్సిన అవసరం ఏముందని, న్యూడిటీ ఎలాగూ ఎడిట్ చేస్తారు, ఇలాంటివి కూడా ఎడిట్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారని ఇండియన్ సెన్సార్ బోర్డ్ వ్యవస్థని బూతులు తిట్టడం మొదలెట్టారు.

ఒక్కోసారి సెన్సార్ వాళ్లు దేనికి A సర్టిఫికెట్ ఇస్తారు అనేది కూడా అర్థం కాదు. గతేడాది విడుదలైన “మోగ్లీ” సినిమాకి A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? “జాట్” లాంటి సినిమాలో ఓ 50 తలకాయలు నరికేసే సీన్స్ ఉన్నా U/A సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? అనేది ఎంత ఆలోచించినా అర్థం కానీ విషయం. “హే బలవంత్, సరస్వతి, కపుల్ ఫ్రెండ్లీ” వంటి సినిమాల టైటిల్స్ విషయంలోనూ సెన్సార్ సభ్యులు ఇష్యూస్ రైజ్ చేసిన సందర్భాలు కూడా చూశాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే సెన్సార్ బోర్డుకి ప్రక్షాళన తప్పదేమో అనిపిస్తుంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Buchi Needs One Last Push For Peddi!

Tollywood is preparing for one of its biggest theatrical outing in the form of Peddi.…

11 minutes ago

Is It The Worst Ever Trade In IPL History?

Mumbai Indians had produced some of the brightest talents in Indian cricket in the form…

41 minutes ago