
ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది. గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని వివరించింది.
కాగా, గ్రామ పెద్దల తీర్పుపై ఉగ్రసేన్ కుటుంబం నియాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారని బాలిక లేఖలో పేర్కొంది. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబం డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాయాలని బాలిక నిర్ణయించుకుంది. తమ భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారులు అందులో ఇల్లు కడుతున్నారని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…
The IT sector has been one of the biggest contributor for the Indian economy over…