
సంక్రాంతి పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణల పోటీ తర్వాత ఫిబ్రవరిలో ‘వేంకటేశుడి’ హంగామాకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీన భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా అధికారికంగా వెలువడిన సమాచారం. దీంతో పాటు విడుదల చేసిన ఓ రెండు స్టిల్స్ కూడా రాఘవేంద్రరావు మార్క్ టాలెంట్ ను చూపిస్తున్నాయనేది అసలు టాక్.
‘కంచె’ ఫేం ప్రజ్ఞా జైస్వాల్ తో నాగార్జున ఉన్న ఫోటో… ఈ సినిమాలో భక్తికే కాదు, రక్తికి కూడా లోటు లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్తోంది. గతంలో ప్రజ్ఞాపై చిత్రీకరించిన పాటపై హాట్ హాట్ గా చర్చలు జరగగా, తాజాగా విడుదల చేసిన స్టిల్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. మరి ఈ రాజకుమారిని వెండితెరపై రాఘవేంద్రుడు ఏ పళ్ళ తోటలో కూర్చోబెడతాడో చూడాలన్న కూతుహలం సినీ అభిమానుల్లో నెలకొనడం సహజమే.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…