Telugu

ఆపరేషన్ సింధూర్ ప్రభావం…ఐపీఎల్ మీద ఉంటుందా.?

కశ్మీర్ పెహల్గామ్ దాడి నేపథ్యంలో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తియిందంటూ భారత ప్రధాని నుంచి భారత సాధారణ పౌరుడు వరకు హర్షం వ్యక్తం చేస్తూ ‘జై హింద్’ అంటూ నినదిస్తున్నారు.

అయితే భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాల మీద జరిపిన దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడిన దాయాది దేశం, భారత్ పై తిరిగి ప్రతిదాడి చేసేందుకు యత్నిస్తోందా.? లేక ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకనుందా అనే దాని పై ఇరు దేశాలలో చర్చలు ఊపందుకున్నాయి.

ADVERTISEMENT

అలాగే ఇటు భారత్ జరిపిన ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ కి సంబంధించిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని పై స్పందించిన మసూద్ ఫ్యామిలీ ఈదాడికి కారణమైన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరికలతో కూడిన ప్రకటనలు జారీ చేస్తున్నారు.

అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తన విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకుని విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉగ్రమూకలు దాడులకు తెగబడితే ప్రజలు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద కూడా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు భారత జవాన్లు.

ఇటువంటి కీలక పరిస్థితులలో ఈ యుద్ధ భయం ప్రభావం, ఆపేరేషన్ సింధూర్ ఎఫెక్ట్ క్రికెట్ ప్రేమికులకు మంచి కిక్ ఇచ్చే ఐపీఎల్ మీద పడనుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మార్చ్ 22 న మొదలైన ఈ ఐపీఎల్ 18 సీజన్ ఇప్పటి వరకు 56 మ్యాచ్ లను ముంచుకుని దాదాపు ముగింపు దశకు చేరుకుంది.

మే 25, 2025 జరగనున్న ఫైనల్ తో ఈ ఐపీఎల్ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందా.? లేక ఏమైనా భద్రతాపరమైన కారణాలతో ముగుస్తోందా అంటూ సోషల్ మీడియాలో ఐపీఎల్ ఫాన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు.

అయితే ఈ వార్తల పై స్పందించిన బీసీసీఐ ఆపరేషన్ సింధూర్ ఐపీఎల్ మీద ప్రభావం చూపకపోవచ్చని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లన్ని కూడా యధావిధిగా జరుగుతాయంటూ ఒక క్లారిటీ ఇచ్చింది.

అయితే పాక్ కు సరిహద్దులలో ఉండే పంజాబ్ రాష్ట్రంలో జరగాల్సిన మ్యాచ్ లను దేశ రాజధాని ఢిల్లీ కి మార్చే అవకాశం ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఐపీఎల్ ను నిర్వహించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి.

ఈ మ్యాచ్లను చూడడానికి వేలాదిగా క్రికెట్ అభిమానులు ముఖ్యంగా యువత ఎక్కువ స్థాయిలో స్టేడియంలకు చేరుకుంటారు. వారికీ పూర్తి భద్రత కల్పించి మ్యాచ్లను సజావుగా సాగేలా చూడడం, అలాగే ఐపీఎల్ కోసం దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్స్ భద్రత విషయంలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవడం అధికారులతో పాటుగా బీసీసీఐ కూడా బాధ్యత అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

22 seconds ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

28 minutes ago