
పాక్‌తో యుద్ధం మూడు రోజుల్లోనే ముగిసింది కానీ…
ఆపరేషన్ సింధూర్‌తో భారత్-పాక్ మద్య యుద్ధం కేవలం మూడు రోజులలోనే మే 10 న ముగిసిపోయింది. దాని తర్వాత నుంచి కాంగ్రెస్, బీజేపిల మద్య మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏమీ సాధించలేకపోయినా, ప్రధాని మోడీ, అమిత్ అమిత్ షా, బీజేపి నేతలు ఆ పేరుతో దేశ ప్రజలను ఆకర్షించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఉగ్రవాదులు భారతీయ మహిళల నుసుట కుంకుమ చెరిపేస్తే, వారికి న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ భూభాగంలో ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు మన సైన్యాన్ని, వీర జవాన్లను మహిళా పైలట్లని ప్రశంసించకపోగా ఏం సాధించారంటూ ప్రశ్నిస్తుండటం సిగ్గుచేటని బీజేపి వాదిస్తోంది.
ఆపరేషన్ సింధూర్‌లో వేలకోట్లు ఖరీదు చేసే అత్యాధునికమైన, అత్యంత శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోతే ఎందుకు దాచిపెడుతున్నారని రాహుల్ గాంధీ ప్రధాని మోడీని, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ని ప్రశ్నిస్తున్నారు.
ఆయన అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా అలా అడుగుతున్నందుకు తమకి దేశభక్తి లేదని బీజేపి నేతలు వాదిస్తుండటాన్ని తెలంగాణ మంత్రి, వాయుసేన మాజీ పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో బీజేపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ పసిగట్టినందున, ఆ పార్టీ కూడా దేశవ్యాప్తంగా కౌంటర్ ర్యాలీలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోని ఓటు బ్యాంక్ చేజారిపోకుండా జాగ్రత్తపడుతోంది.
ఈవిదంగా ఆపరేషన్ సింధూర్‌లో కూలిన రఫెల్ విమానాలెన్ని?చనిపోయిన జవాన్లు ఎందరు? లెక్కలు చెప్పదంటూ నిలదీస్తూ బీజేపిని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది.
అయితే యుద్ధంలో సాధించిన విజయాల గురించి ఏ ప్రభుత్వమైనా చెప్పుకుంటుంది కానీ జరిగిన నష్టాన్ని చెప్పుకొని నవ్వులపాలు కావాలనుకోదు కదా?
కాంగ్రెస్ హయంలో కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, కానీ తామెన్నడూ ప్రధాని మోడీలా చాటింపు వేసుకోలేదని కాంగ్రెస్ నేతలే చెపుకుంటున్నారు.
ఇంతకాలం వాటి గురించి రహస్యంగా ఉంచామని వారే చెప్పుకొంటున్నప్పుడు, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన దేశ భద్రత, రక్షణకు సంబందించిన విషయాలను చాటింపు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం సిగ్గుచేటు కాదా?
BOTTOM LINE Outdated Comedy, Comrade RATING 1.75/5 Story, Screenplay,Director: Janakiram Marella Cast: Sree Vishnu, Mahima…
BOTTOM LINE Novel Thriller, Slightly Overstuffed PLATFORM SonyLIV RUNTIME 6 Hours [7 Episodes] What Is…