
గురువారం నాడు కత్తి మహేష్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంలో… కత్తికి అనుకూలంగా ఓయూ జేఏసీ విద్యార్ధులు “పవన్ కళ్యాణ్ హటావో… పోలిటిక్స్ బచావో…” అంటూ పిలుపునిచ్చారు. ఇక నుండి మహేష్ పై దాడి జరిగినట్లు తెలిస్తే… పవన్ కళ్యాణ్ ను తెలంగాణాలో తిరగబోనివ్వమని హెచ్చరించారు. భారీ స్థాయిలో విద్యార్ధిగణం రావడం, అది పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఈ సందర్భంగా కత్తి మహేష్ కూడా ప్రసంగించారు.
“తన అభిమానులను పవన్ వేరే పార్టీలకు అమ్ముకుంటున్నారని, అలాగే తాను మౌనం వహిస్తూ పరోక్షంగా అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నాడని, ఇప్పటికైనా తన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని” సూచించాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో పూర్తిగా డీలాపడిన పవన్ ఫ్యాన్స్ తమ దూకుడును కూడా తగ్గించినట్లే కనపడుతోంది. ఎందుకంటే… తమ సినిమా ఫ్లాప్ అయినా కలెక్షన్స్ అదిరిపోతాయి అనే భ్రమలో ఉన్న ఫ్యాన్స్ కు “అజ్ఞాతవాసి” ఓపెనింగ్స్ షాక్ ఇవ్వడంతో, ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…